Veduga vasamtamu vela nide

వేడుక వసంతము వేళ నిదే
Language

(॥పల్లవి॥)
వేడుక వసంతము వేళ నిదే
వాడల వాడల వెంట వనిత లాడేరు

(॥॥)
కేలుఁగేలుజుట్టిపట్టి కెండామర మోములెత్తి
కోలఁగోలఁ దాఁకఁజేసి గుంపువాయక
చాలుకొని యిద్దరేసి జంటలై సతులు గూడి
వోలి వేరొకతెకోల నొడ్డుతా నాడేరు

(॥॥)
పాలిండ్లు గడలఁగ బరువైనతురుముల
చీలుచు సోలుచుఁ గొంతవెనకకును
మేలిమిపిఱుఁదులతో మెరయుచు మురియుచు
కోలలఁబెడమరలి కోలాటమాడేరు

(॥॥)
కది శొండురుమోములు కన్నులఁదేలించి చూచి
పదతాళగతులకు పడఁతులెల్లా
అదివో శ్రీ వేంకటేశుఁ డల మేలుమంగతోడ
ముదమంది చూడఁగాను ముందట నాడేడు

(||pallavi||)
veḍuga vasaṁtamu veḽa nide
vāḍala vāḍala vĕṁṭa vanida lāḍeru

(||||)
kelum̐gelujuṭṭibaṭṭi kĕṁḍāmara momulĕtti
kolam̐golam̐ dām̐kam̐jesi guṁpuvāyaga
sālugŏni yiddaresi jaṁṭalai sadulu gūḍi
voli verŏgadĕgola nŏḍḍudā nāḍeru

(||||)
pāliṁḍlu gaḍalam̐ga baruvainadurumula
sīlusu solusum̐ gŏṁtavĕnagagunu
melimibiṟum̐dulado mĕrayusu muriyusu
kolalam̐bĕḍamarali kolāḍamāḍeru

(||||)
kadi śhŏṁḍurumomulu kannulam̐deliṁchi sūsi
padadāḽagadulagu paḍam̐tulĕllā
adivo śhrī veṁkaḍeśhum̐ ḍala melumaṁgadoḍa
mudamaṁdi sūḍam̐gānu muṁdaḍa nāḍeḍu