వేడుక చూడవద్దటే వేగిరించే వింతలోనె
(॥పల్లవి॥)
వేడుక చూడవద్దటే వేగిరించే వింతలోనె
కోడెకాఁడై వలపులు గొల్లలాడఁగాను
(॥వేడు॥)
సన్నలేల సేసేవే సణఁగేల రాలిచేవే
మిన్నక కొలువులోన నున్న వానిపై
చన్నులనేల వూఁదేవే సారెనేల జంకించేవే
వున్నతి రాజముతో నూరకుండఁగాను
(॥వేడు॥)
చేతు లేల చాఁచేవే చెరఁగేల పట్టేవే
తోతో కొండవంటిదొర యీతఁడు
నీకు లేల చదివేవే నేరమేల యెంచేవే
నాతులతో బాఁతిపడి నవ్వు నవ్వఁగాను
(॥వేడు॥)
సిగ్గులేల నెరసేవే శిరసేల వంచేవే
యెగ్గులేక కాఁగిట నే నెనయఁగాను
అగ్గమై శ్రీవేంకటేశుఁడంతలోనె నిన్నుఁగూడె
వొగ్గినరతుల నీతో నోలలాడఁగాను
(||pallavi||)
veḍuga sūḍavaddaḍe vegiriṁche viṁtalonĕ
koḍĕgām̐ḍai valabulu gŏllalāḍam̐gānu
(||veḍu||)
sannalela seseve saṇam̐gela rāliseve
minnaga kŏluvulona nunna vānibai
sannulanela vūm̐deve sārĕnela jaṁkiṁcheve
vunnadi rājamudo nūraguṁḍam̐gānu
(||veḍu||)
sedu lela sām̐seve sĕram̐gela paṭṭeve
todo kŏṁḍavaṁṭidŏra yīdam̐ḍu
nīgu lela sadiveve neramela yĕṁcheve
nādulado bām̐tibaḍi navvu navvam̐gānu
(||veḍu||)
siggulela nĕraseve śhirasela vaṁcheve
yĕggulega kām̐giḍa ne nĕnayam̐gānu
aggamai śhrīveṁkaḍeśhum̐ḍaṁtalonĕ ninnum̐gūḍĕ
vŏgginaradula nīdo nolalāḍam̐gānu