Veduga nem jesidenu vemgemamduraa

వేడుక నేఁ జేసితేను వెంగెమందురా
Language

(॥పల్లవి॥)
వేడుక నేఁ జేసితేను వెంగెమందురా
కోడెతనమెల్ల నాపై గురిసేసేవేరా

(॥వేడు॥)
చిగురుఁబెదవి వంచి చెప్పితి నేఁ బ్రియములు
నగవు లింకానేల నాతో నీకు
అగడు నేఁ జేసితే నాయములు సోఁకెఁగాక
తగుఁ బలుసోఁకులకే తమికించేవేరా

(॥వేడు॥)
కొనగోరు వంచి నిన్ను కొసరితిఁ బలుమారు
పెనఁగ నింకానేల బింకాన నీకు
మొనలు నేఁ జూపితి నామోహములు రేఁగెఁగాక
కొనచంద్రవంకలకే గుంపించేవేరా

(॥వేడు॥)
గట్టిచన్ను లిటు వంచి కాఁగిలించుకొంటి నిన్ను
గుట్టుసేయ నిఁకనేల కొసరి నీకు
ఇట్టె శ్రీవేంకటేశ యిందుకే మెచ్చితిఁగాక
చుట్టపురతుల కిఁక సూడువట్టేవేరా

(||pallavi||)
veḍuga nem̐ jesidenu vĕṁgĕmaṁdurā
koḍĕdanamĕlla nābai guriseseverā

(||veḍu||)
sigurum̐bĕdavi vaṁchi sĕppidi nem̐ briyamulu
nagavu liṁkānela nādo nīgu
agaḍu nem̐ jeside nāyamulu som̐kĕm̐gāga
tagum̐ balusom̐kulage tamigiṁcheverā

(||veḍu||)
kŏnagoru vaṁchi ninnu kŏsaridim̐ balumāru
pĕnam̐ga niṁkānela biṁkāna nīgu
mŏnalu nem̐ jūbidi nāmohamulu rem̐gĕm̐gāga
kŏnasaṁdravaṁkalage guṁpiṁcheverā

(||veḍu||)
gaṭṭisannu liḍu vaṁchi kām̐giliṁchugŏṁṭi ninnu
guṭṭuseya nim̐kanela kŏsari nīgu
iṭṭĕ śhrīveṁkaḍeśha yiṁduge mĕchchidim̐gāga
suṭṭaburadula kim̐ka sūḍuvaṭṭeverā