వేడుక మీ వలపులు వెల్లవిరాయ
(॥పల్లవి॥)
వేడుక మీ వలపులు వెల్లవిరాయ
యీడుజోడైన పొందులు యిట్టుండవలదా
(॥॥)
సెలవుల నవ్వుతాను చిప్పిలి సిగ్గులతోడ
కలువపువ్వులాకె కానుకిచ్చెను
కొలువులోపల నీవు కుందణపుటుంగరము
తలకొని నీవు వుచితముగా నిచ్చితివి
(॥॥)
కన్నులను మొక్కుతాను కడలేని యాసతోడ
కన్నె సూడిదె వట్టె టెంకాయ నీకు
సన్నల మేడలోనుండి చనవునఁ గంటసరి
యెన్నికతోడ నీవు యీవిగా నిచ్చితివి
(॥॥)
సరములాడుతాను చల్లని పానుపుమీఁద
గరిమె నద్దము చూపి కలసె నిన్ను
యిరవై శ్రీవేంకటేశ యేలితివాకెను నన్ను
యెరవుతో మోవిలంచ మిద్దరికిచ్చితివి
(||pallavi||)
veḍuga mī valabulu vĕllavirāya
yīḍujoḍaina pŏṁdulu yiṭṭuṁḍavaladā
(||||)
sĕlavula navvudānu sippili sigguladoḍa
kaluvabuvvulāgĕ kānugichchĕnu
kŏluvulobala nīvu kuṁdaṇabuḍuṁgaramu
talagŏni nīvu vusidamugā nichchidivi
(||||)
kannulanu mŏkkudānu kaḍaleni yāsadoḍa
kannĕ sūḍidĕ vaṭṭĕ ṭĕṁkāya nīgu
sannala meḍalonuṁḍi sanavunam̐ gaṁṭasari
yĕnnigadoḍa nīvu yīvigā nichchidivi
(||||)
saramulāḍudānu sallani pānubumīm̐da
garimĕ naddamu sūbi kalasĕ ninnu
yiravai śhrīveṁkaḍeśha yelidivāgĕnu nannu
yĕravudo movilaṁcha middarigichchidivi