Veduga lettivo meegu vina vedugayyee maagu

వేడుక లెట్టివో మీకు విన వేడుకయ్యీ మాకు
Language

(॥పల్లవి॥)
వేడుక లెట్టివో మీకు విన వేడుకయ్యీ మాకు
ఆడిక కోడవు మాతో నానతియ్యవయ్యా

(॥వేడు॥)
చెంపలతురుముతోడ సెలవినవ్వులతోడ
యింపులు చల్లీ నీపై నెవ్వతెయ్యా
దింపరానియాసతోడ తీరనిముచ్చటతోడ-
నంపలేక మాటలాడే వాపె నీ వయ్యా

(॥వేడు॥)
పుక్కిటివిడెముతోడ పొతపుసిగ్గులతోడ
యిక్కువఁ గాచుకున్నది యెవ్వతెయ్యా
లక్కవంటిమనసుతో లలి నిట్టచూపుతోడ-
నక్కరలెల్లాఁ జల్లే వౌనయ్య నీవూ

(॥వేడు॥)
వాడిక మొక్కులతోడ వావులపొందులతోడ
యీడుజోడై పెనఁగీ నెవ్వతెయ్యా
కూడితి వింతలో నీవు గొబ్బున శ్రీవేంకటేశ
యీడ న్ను నేలితివి యిదియు నౌనయ్యా

(||pallavi||)
veḍuga lĕṭṭivo mīgu vina veḍugayyī māgu
āḍiga koḍavu mādo nānadiyyavayyā

(||veḍu||)
sĕṁpaladurumudoḍa sĕlavinavvuladoḍa
yiṁpulu sallī nībai nĕvvadĕyyā
diṁparāniyāsadoḍa tīranimuchchaḍadoḍa-
naṁpalega māḍalāḍe vābĕ nī vayyā

(||veḍu||)
pukkiḍiviḍĕmudoḍa pŏdabusigguladoḍa
yikkuvam̐ gāsugunnadi yĕvvadĕyyā
lakkavaṁṭimanasudo lali niṭṭasūbudoḍa-
nakkaralĕllām̐ jalle vaunayya nīvū

(||veḍu||)
vāḍiga mŏkkuladoḍa vāvulabŏṁduladoḍa
yīḍujoḍai pĕnam̐gī nĕvvadĕyyā
kūḍidi viṁtalo nīvu gŏbbuna śhrīveṁkaḍeśha
yīḍa nnu nelidivi yidiyu naunayyā