వేడుక గలవారికి వెంగెములే హితవౌను
(॥పల్లవి॥)
వేడుక గలవారికి వెంగెములే హితవౌను
పాడిపంతా లిందు నేల పచారించేవయ్యా
(॥॥)
కాంతలు పతితోడుత కసరినాఁ గొసరినా
వింతతమి వుట్టుఁగాక వేసదయ్యీనా
అంతరంగపు సుద్దులు ఆకెకు నీకుఁదెలుసు
చెంతనున్న మా కేమి చెప్పేవయ్యా
(॥॥)
అంగనలు వద్దనుండి అలసినా సొలసినా
సంగతులే అవుఁ గాక చవుక లయ్యీనా
యింగితపు మీభావాలెట్టుండినా నుండెఁగాక
అంగవించి మాతో నేమి ఆనతిచ్చేవయ్యా
(॥॥)
వువిదలు రతి వేళ నొరసినా మెఱసినా
చవులయే వుండుఁగాక చప్పనయ్యీనా
యివల శ్రీ వేంకటేశ యింతి నిట్టే కూడితివి
తివిరి మా కిఁక నేమి దెలిపేవయ్యా
(||pallavi||)
veḍuga galavārigi vĕṁgĕmule hidavaunu
pāḍibaṁtā liṁdu nela pasāriṁchevayyā
(||||)
kāṁtalu padidoḍuda kasarinām̐ gŏsarinā
viṁtadami vuṭṭum̐gāga vesadayyīnā
aṁtaraṁgabu suddulu āgĕgu nīgum̐dĕlusu
sĕṁtanunna mā kemi sĕppevayyā
(||||)
aṁganalu vaddanuṁḍi alasinā sŏlasinā
saṁgadule avum̐ gāga savuga layyīnā
yiṁgidabu mībhāvālĕṭṭuṁḍinā nuṁḍĕm̐gāga
aṁgaviṁchi mādo nemi ānadichchevayyā
(||||)
vuvidalu radi veḽa nŏrasinā mĕṟasinā
savulaye vuṁḍum̐gāga sappanayyīnā
yivala śhrī veṁkaḍeśha yiṁti niṭṭe kūḍidivi
tiviri mā kim̐ka nemi dĕlibevayyā