వేడు కిది దాఁచరాదు వెల్లవిరిఁ జేయరాదు
(॥పల్లవి॥)
వేడు కిది దాఁచరాదు వెల్లవిరిఁ జేయరాదు
కూడిన తారుకాణలు గుట్టుతోనే వున్నవి
(॥వేడు॥)
ఆడుకోలుమాఁట గద్దు ఆతనికి నాకును
తోడితేవే విన్నవించే తోడనే నేను
జోడిం చొకరితోఁ జెప్పేసుద్దులు గావు
జాడతో నే నెరుఁగుదు సరిఁ దా నెరుఁగును
(॥వేడు॥)
సేసిన గురుతు గద్దు చేరి మా యిద్దరికి
రాసికెక్కఁ జూచెను రమ్మనఁగదె
మూసిమంతనములైన మొరఁగులవి
ఆసల నాయందు నున్నవా తనందు నున్నవి
(॥వేడు॥)
యేకతపు పొందు గద్దు యిద్దరికిని
జోకతో శ్రీవేంకటేశుఁ జూపఁగదవే
మాకె తెలుసు నలమేలుమంగను నేను
యీకడ నా మగఁ డీతఁ డీతని దేవులను
(||pallavi||)
veḍu kidi dām̐sarādu vĕllavirim̐ jeyarādu
kūḍina tārugāṇalu guṭṭudone vunnavi
(||veḍu||)
āḍugolumām̐ṭa gaddu ādanigi nāgunu
toḍideve vinnaviṁche toḍane nenu
joḍiṁ sŏgaridom̐ jĕppesuddulu gāvu
jāḍado ne nĕrum̐gudu sarim̐ dā nĕrum̐gunu
(||veḍu||)
sesina gurudu gaddu seri mā yiddarigi
rāsigĕkkam̐ jūsĕnu rammanam̐gadĕ
mūsimaṁtanamulaina mŏram̐gulavi
āsala nāyaṁdu nunnavā tanaṁdu nunnavi
(||veḍu||)
yegadabu pŏṁdu gaddu yiddarigini
jogado śhrīveṁkaḍeśhum̐ jūbam̐gadave
māgĕ tĕlusu nalamelumaṁganu nenu
yīgaḍa nā magam̐ ḍīdam̐ ḍīdani devulanu