వెడ్డువెట్టి నేమెల్లా వేసరితిమి
(॥పల్లవి॥)
వెడ్డువెట్టి నేమెల్లా వేసరితిమి
అడ్డివెట్ట కిప్పుడే రావయ్య లోనికిని
(॥వెడ్డు॥)
పదరేటివాఁడవు పంతగాఁడవు మొదల
యెదుటనుండి నపతి నేమంటివి
మదిమదిఁ బవ్వళించి మాటలాడ దెవ్వ రితో
అదె వేఁడుకొందువు రావయ్య వొద్దికిని
(॥వెడ్డు॥)
కోపకాఁడవు మరి కోడెకాఁడవు మొదల
యేపురేఁగి యేకతాన నేమంటివి
ఆపొద్దుననుండియును ఆరగించకున్నది
యీపాటినే రావయ్య ఇచ్చకము సేతువు
(॥వెడ్డు॥)
శ్రీవేంకటేశుఁడవు చెలికాఁడవు మొదల
యీవిధానఁ గూడుతానే యేమంటివి
సేవలు నేము సేయఁగా సిగ్గులతో నున్నది
యీవు లిత్తువు రావయ్య ఇన్నిటా నేర్పరివి
(||pallavi||)
vĕḍḍuvĕṭṭi nemĕllā vesaridimi
aḍḍivĕṭṭa kippuḍe rāvayya lonigini
(||vĕḍḍu||)
padareḍivām̐ḍavu paṁtagām̐ḍavu mŏdala
yĕduḍanuṁḍi nabadi nemaṁṭivi
madimadim̐ bavvaḽiṁchi māḍalāḍa dĕvva rido
adĕ vem̐ḍugŏṁduvu rāvayya vŏddigini
(||vĕḍḍu||)
kobagām̐ḍavu mari koḍĕgām̐ḍavu mŏdala
yeburem̐gi yegadāna nemaṁṭivi
ābŏddunanuṁḍiyunu āragiṁchagunnadi
yībāḍine rāvayya ichchagamu seduvu
(||vĕḍḍu||)
śhrīveṁkaḍeśhum̐ḍavu sĕligām̐ḍavu mŏdala
yīvidhānam̐ gūḍudāne yemaṁṭivi
sevalu nemu seyam̐gā siggulado nunnadi
yīvu littuvu rāvayya inniḍā nerbarivi