వెడ్డువెట్ట కంత నీవు వెఱతు నేను
(॥పల్లవి॥)
వెడ్డువెట్ట కంత నీవు వెఱతు నేను
యెడ్డనా నేనేమయినా యింతలోని పనికి
(॥వెడ్డు॥)
రమ్మనవే చెలియా రమణుని నీడకే
యిమ్ములనే నాడ కేల యెవ్వ రుందురో
నెమ్మదిఁ జన్నులు రాసి నీవు నేనుఁ బెనఁగఁగా
అమ్మరో నన్నుఁదియ్యకు ఆడనున్నాఁ డతఁడు
(॥వెడ్డు॥)
అదన నేమాటయినా నాడు మనవే తానే
యెదురుమాట నా కేల యే మందునో
పెదవుల తీఁటె పో పిలువఁగఁ బిలువఁగ
అదివో నాతోఁ జెప్పకు మంతేసి కే నోపను
(॥వెడ్డు॥)
మొక్కకు మనవే తాను మొదలనే నన్నుఁ గూడె
యెక్కుడు నేనే మొక్కే యేపనికైనా
అక్కరో శ్రీవేంకటేశుఁ డరచేతిమాణికము
యిక్కువలు గరఁగించే వింతే పో మాటా
(||pallavi||)
vĕḍḍuvĕṭṭa kaṁta nīvu vĕṟadu nenu
yĕḍḍanā nenemayinā yiṁtaloni panigi
(||vĕḍḍu||)
rammanave sĕliyā ramaṇuni nīḍage
yimmulane nāḍa kela yĕvva ruṁduro
nĕmmadim̐ jannulu rāsi nīvu nenum̐ bĕnam̐gam̐gā
ammaro nannum̐diyyagu āḍanunnām̐ ḍadam̐ḍu
(||vĕḍḍu||)
adana nemāḍayinā nāḍu manave tāne
yĕdurumāḍa nā kela ye maṁduno
pĕdavula tīm̐ṭĕ po piluvam̐gam̐ biluvam̐ga
adivo nādom̐ jĕppagu maṁtesi ke nobanu
(||vĕḍḍu||)
mŏkkagu manave tānu mŏdalane nannum̐ gūḍĕ
yĕkkuḍu nene mŏkke yebanigainā
akkaro śhrīveṁkaḍeśhum̐ ḍarasedimāṇigamu
yikkuvalu garam̐giṁche viṁte po māḍā