Vedavinnaba mimka nemtigi vesa maa seliyanum gaavumu

వెడవిన్నప మిఁక నేఁటికి వెస మా చెలియనుఁ గావుము
Language

(॥పల్లవి॥)
వెడవిన్నప మిఁక నేఁటికి వెస మా చెలియనుఁ గావుము
తొడిఁబడ నీతో విరహము దొమ్ములు సేసీని

(॥వెడ॥)
చెలి పై నొంగనలాగును చెక్కిటచేయున్న బాగును
నెలఁతకు నీపై వలపులు నిక్కము దెలిపీని
పలుకులలోపలికొసరులు పైపై సురటులవిసరులు
చిలుకులపాయము నీకే సెలువులె సేసీని

(॥వెడ॥)
ఆయము గరఁగినకరఁగులు ఆ రమర మరచినమరఁగులు
వోయని నీకాఁకలకును వొప్పన సేసీని
పాయనిమదములఅలపులు పనివిడి నీతో పితుపులు
చాయల సన్నల నిదివో చనవులు నెరపీని

(॥వెడ॥)
రెప్పలు వేయని చూపులు రేసులతో తరితీపులు
ముప్పిరి నీముందరనే ముచ్చట లాడిని
యిప్పుడె శ్రీవేంకటేశ్వర యీసతికవుఁగిటఁ గలసితి
వొప్పగుతనసమరతులే వుంకువ లిచ్చీని

(||pallavi||)
vĕḍavinnaba mim̐ka nem̐ṭigi vĕsa mā sĕliyanum̐ gāvumu
tŏḍim̐baḍa nīdo virahamu dŏmmulu sesīni

(||vĕḍa||)
sĕli pai nŏṁganalāgunu sĕkkiḍaseyunna bāgunu
nĕlam̐tagu nībai valabulu nikkamu dĕlibīni
palugulalobaligŏsarulu paibai suraḍulavisarulu
silugulabāyamu nīge sĕluvulĕ sesīni

(||vĕḍa||)
āyamu garam̐ginagaram̐gulu ā ramara marasinamaram̐gulu
voyani nīgām̐kalagunu vŏppana sesīni
pāyanimadamulaalabulu paniviḍi nīdo pidubulu
sāyala sannala nidivo sanavulu nĕrabīni

(||vĕḍa||)
rĕppalu veyani sūbulu resulado taridībulu
muppiri nīmuṁdarane muchchaḍa lāḍini
yippuḍĕ śhrīveṁkaḍeśhvara yīsadigavum̐giḍam̐ galasidi
vŏppagudanasamaradule vuṁkuva lichchīni