(॥పల్లవి॥)
వేదనఁ బొరలే వెరవేలా
యీ దయ విధి దన కీయదా
(॥వేద॥)
తత్తరపాట్ల తనువికారములఁ
జిత్తము దెంచే చెలువేలా
బత్తితో దాఁచిన పరధనంబుంగొని
సత్తయి వుండుట చాలదా
(॥వేద॥)
యెక్కువతమకపుటింతులఁ బొందక
పక్కుచువాడేవయసేలా
మొక్కుచు దాఁచిన మూలధనము గన-
నెక్కువ దైవం బియ్యదా
(॥వేద॥)
సేఁతలఁ బొరలెడి చిక్కులఁ గెరలెడి-.
రోఁతల యీనేరుపులేలా
బాఁతిగ వేంకటపతిరతిఁ జిత్తపు-
టూఁతలఁ గోరిక లూనవా
(||pallavi||)
vedanam̐ bŏrale vĕravelā
yī daya vidhi dana kīyadā
(||veda||)
tattarabāṭla tanuvigāramulam̐
jittamu dĕṁche sĕluvelā
battido dām̐sina paradhanaṁbuṁgŏni
sattayi vuṁḍuḍa sāladā
(||veda||)
yĕkkuvadamagabuḍiṁtulam̐ bŏṁdaga
pakkusuvāḍevayaselā
mŏkkusu dām̐sina mūladhanamu gana-
nĕkkuva daivaṁ biyyadā
(||veda||)
sem̐talam̐ bŏralĕḍi sikkulam̐ gĕralĕḍi-.
rom̐tala yīnerubulelā
bām̐tiga veṁkaḍabadiradim̐ jittabu-
ṭūm̐talam̐ goriga lūnavā