వెడకూటములకంటె విరహమే మేలు
(॥పల్లవి॥)
వెడకూటములకంటె విరహమే మేలు
విడువక యాడఁబోతే వేసటౌరా మాటలు
(॥వెడ॥)
కోరి దవ్వులనుండఁగఁ గొండలు నున్నన గాని
చేరితేను చెట్లునుఁ జేమ లింతేరా
వారక కొక్కకవేళ వచ్చి పోవుటే చవి
నారి నిన్నుఁ గొసరితేఁ జప్పనౌరా రతులు
(॥వెడ॥)
వొక్కటై పసపు నీడ నుండఁగాఁ బచ్చనఁ గాని
పక్కన నెండ నుండితేఁ బస లేదురా
తక్కక యడమాటలే తరితీపై వుండుఁ గాని
మిక్కిలి దగ్గరుపొందుమీఁద మొగచాటురా
(॥వెడ॥)
వొనరుఁ గోవిల కాకి నొక్కవన్నె వుండుఁ గాని
యెనసి వసంతవేళ నేరుపడురా
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
తనువులే వేరు గాని తలఁపు లొక్కటేరా
(||pallavi||)
vĕḍagūḍamulagaṁṭĕ virahame melu
viḍuvaga yāḍam̐bode vesaḍaurā māḍalu
(||vĕḍa||)
kori davvulanuṁḍam̐gam̐ gŏṁḍalu nunnana gāni
seridenu sĕṭlunum̐ jema liṁterā
vāraga kŏkkagaveḽa vachchi povuḍe savi
nāri ninnum̐ gŏsaridem̐ jappanaurā radulu
(||vĕḍa||)
vŏkkaḍai pasabu nīḍa nuṁḍam̐gām̐ bachchanam̐ gāni
pakkana nĕṁḍa nuṁḍidem̐ basa ledurā
takkaga yaḍamāḍale taridībai vuṁḍum̐ gāni
mikkili daggarubŏṁdumīm̐da mŏgasāḍurā
(||vĕḍa||)
vŏnarum̐ govila kāgi nŏkkavannĕ vuṁḍum̐ gāni
yĕnasi vasaṁtaveḽa nerubaḍurā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
tanuvule veru gāni talam̐pu lŏkkaḍerā