Vedagide neevamti velbu levvarunnaaru

వెదకితే నీవంటి వేల్పు లెవ్వరున్నారు
Language

(॥పల్లవి॥)
వెదకితే నీవంటి వేల్పు లెవ్వరున్నారు
అదన నీ దాసుఁడైన యతఁడే పుణ్యుఁడయ్యా

(॥వెదకి॥)
యేలేది పరమపద మీశ్వరుఁడ విందరికి
మేలిమి శ్రీభూమీసమేతుఁడవు
పాలింతువు లోక మెల్ల బ్రహ్మంతవాఁడు గొడుకు
వాలాయించి నిన్నుఁ గొల్చువాఁడే ధన్యుఁ డయ్యా

(॥వెదకి॥)
పండేది పాలజలధి పంపు సేసేది చక్రము
నిండువన్నెపైఁడికోక నీ మేనది
వుండుదు వందరిలోన యోగమాయ నీ మహిమ
అండ నిన్ను నమ్మినవాఁ డన్నిటాఁ బూజ్యుఁ డయ్యా

(॥వెదకి॥)
సూరలు నీ యాజ్ఞవారు సూర్యచంద్రులు కన్నులు
బిరుదు టెక్కెములు చూపే వేదములు
వురమున నలమేల్మంగ యొప్పెను శ్రీవేంకటేశ
గరిమ నీ శరణన్న ఘనుఁడే నేర్పరయ్యా

(||pallavi||)
vĕdagide nīvaṁṭi velbu lĕvvarunnāru
adana nī dāsum̐ḍaina yadam̐ḍe puṇyum̐ḍayyā

(||vĕdagi||)
yeledi paramabada mīśhvarum̐ḍa viṁdarigi
melimi śhrībhūmīsamedum̐ḍavu
pāliṁtuvu loga mĕlla brahmaṁtavām̐ḍu gŏḍugu
vālāyiṁchi ninnum̐ gŏlsuvām̐ḍe dhanyum̐ ḍayyā

(||vĕdagi||)
paṁḍedi pālajaladhi paṁpu sesedi sakramu
niṁḍuvannĕbaim̐ḍigoga nī menadi
vuṁḍudu vaṁdarilona yogamāya nī mahima
aṁḍa ninnu namminavām̐ ḍanniḍām̐ būjyum̐ ḍayyā

(||vĕdagi||)
sūralu nī yājñavāru sūryasaṁdrulu kannulu
birudu ṭĕkkĕmulu sūbe vedamulu
vuramuna nalamelmaṁga yŏppĕnu śhrīveṁkaḍeśha
garima nī śharaṇanna ghanum̐ḍe nerbarayyā