Vedagi vedagi soppu lettusunu visaarimchidi ninnaallu

వెదకి వెదకి చొప్పు లెత్తుచును విచారించితి నిన్నాళ్లు
Language

(॥పల్లవి॥)
వెదకి వెదకి చొప్పు లెత్తుచును విచారించితి నిన్నాళ్లు
యిదివో కంటిని శ్రీవేంకటగిరి యెదుటనే నీ శ్రీపాదములు

(॥వెదకి॥)
ఘనతులసీకాననంబులో కాఁపురము సేతు వనఁగాను
అనిశమ్ముఁ బద్మవనంబునను ఆడుచు నుండుదు వనఁగాను
నిను నీ దాసులు పాడేచోట్ల నెలవై లింతు వనఁగాను
యినమండలమున నుండుదు వనఁగా యీవట విని నేను

(॥వెదకి॥)
పైకొని క్షీరాంబుధిలో నెప్పుడు పవళించి వుందు వనఁగాను
వైకుంఠంబున వెలుఁగొందుచు సర్వము భావించే వనఁగాను
దాకొని జీవులలో నెప్పుడు నంతర్యామివై వుందు వనఁగాను
లోకము నీవై వుండుదు వనఁగా లోలత నీమాట విని నేను

(॥వెదకి॥)
పరమయోగీంద్రులు తలపోయుచునున్న భావముతో నుందు వనఁగాను
పరిపరివిధముల పుణ్యకర్మము పాయక చరింతు వనఁగాను
గరిమల నెప్పుడు అలమేల్మంగ కౌఁగిటిలోవాఁడ వనఁగాను
యిరవుగ శ్రీవేంకటేశుఁడ వనఁగా యీమాట విని నేను

(||pallavi||)
vĕdagi vĕdagi sŏppu lĕttusunu visāriṁchidi ninnāḽlu
yidivo kaṁṭini śhrīveṁkaḍagiri yĕduḍane nī śhrībādamulu

(||vĕdagi||)
ghanadulasīgānanaṁbulo kām̐puramu sedu vanam̐gānu
aniśhammum̐ badmavanaṁbunanu āḍusu nuṁḍudu vanam̐gānu
ninu nī dāsulu pāḍesoṭla nĕlavai liṁtu vanam̐gānu
yinamaṁḍalamuna nuṁḍudu vanam̐gā yīvaḍa vini nenu

(||vĕdagi||)
paigŏni kṣhīrāṁbudhilo nĕppuḍu pavaḽiṁchi vuṁdu vanam̐gānu
vaiguṁṭhaṁbuna vĕlum̐gŏṁdusu sarvamu bhāviṁche vanam̐gānu
dāgŏni jīvulalo nĕppuḍu naṁtaryāmivai vuṁdu vanam̐gānu
logamu nīvai vuṁḍudu vanam̐gā lolada nīmāḍa vini nenu

(||vĕdagi||)
paramayogīṁdrulu talaboyusununna bhāvamudo nuṁdu vanam̐gānu
paribarividhamula puṇyagarmamu pāyaga sariṁtu vanam̐gānu
garimala nĕppuḍu alamelmaṁga kaum̐giḍilovām̐ḍa vanam̐gānu
yiravuga śhrīveṁkaḍeśhum̐ḍa vanam̐gā yīmāḍa vini nenu