Vedageda ninu ne vedamu seppamga

వెదకెద నిను నే వేదము చెప్పఁగ
Language

(॥పల్లవి॥)
వెదకెద నిను నే వేదము చెప్పఁగ
హృదయములోననే యిరవు నీ కటా

(॥వెద॥)
శ్రీనాథా పిలిచితిఁ బలుకఁగదే
పూని యన్నిటా నుందువట
మానితముగ నామాట వినఁగదే
వీనుల సర్వము విందువటా

(॥వెద॥)
పరమాత్మా తప్పక పొడచూపవే
తరుణవయసు మరుతండ్రివటా
పరగ మొక్కెదను పాదము చాఁచవే
సిరుల బ్రహ్మ పూజించినదే యటా

(॥వెద॥)
గోవిందా నీ గుఱు తెఱిఁగించవే
వేవేలు మహిమల విభుఁడవటా
శ్రీవేంకటేశా జిగి నలమేల్మంగ
కైవసమై మముఁ గాతువటా

(||pallavi||)
vĕdagĕda ninu ne vedamu sĕppam̐ga
hṛdayamulonane yiravu nī kaḍā

(||vĕda||)
śhrīnāthā pilisidim̐ balugam̐gade
pūni yanniḍā nuṁduvaḍa
mānidamuga nāmāḍa vinam̐gade
vīnula sarvamu viṁduvaḍā

(||vĕda||)
paramātmā tappaga pŏḍasūbave
taruṇavayasu marudaṁḍrivaḍā
paraga mŏkkĕdanu pādamu sām̐save
sirula brahma pūjiṁchinade yaḍā

(||vĕda||)
goviṁdā nī guṟu tĕṟim̐giṁchave
vevelu mahimala vibhum̐ḍavaḍā
śhrīveṁkaḍeśhā jigi nalamelmaṁga
kaivasamai mamum̐ gāduvaḍā