(॥పల్లవి॥)
వేదాంతవిదులాల వివేకులాల
పోదితోడ నే మింక బుద్ధు లడిగేమయ్యా
(॥వేదాంత॥)
తిత్తిలోని కాఁపురపు దేహి నేను నా
చిత్తములోపలివాఁడు శ్రీవిభుఁడు
పొత్తులనా దాఁపరము పూర్వకర్మము
విత్తి విత్తి మొలపించీ వినరయ్యా
(॥వేదాంత॥)
పొదిఁ బంచభూతముల పుర మేలెను నేను
కదిసి నన్నేలేవాఁడు గదాధరుఁడు
యెదిటి నా మై సొమ్ము లింద్రియములు
గుదిగొని మించీ నిదిగో చూడరయ్యా
(॥వేదాంత॥)
కొలఁది జన్మమునకు గుఱి నేను
వెలయ నాకు గుఱి శ్రీవేంకటేశుఁడు
సులభపు నాగుణము సుజ్ఞానము
చెలరేఁగి చెలరేఁగి చిత్తగించవయ్యా
(||pallavi||)
vedāṁtavidulāla vivegulāla
podidoḍa ne miṁka buddhu laḍigemayyā
(||vedāṁta||)
tittiloni kām̐purabu dehi nenu nā
sittamulobalivām̐ḍu śhrīvibhum̐ḍu
pŏttulanā dām̐paramu pūrvagarmamu
vitti vitti mŏlabiṁchī vinarayyā
(||vedāṁta||)
pŏdim̐ baṁchabhūdamula pura melĕnu nenu
kadisi nannelevām̐ḍu gadādharum̐ḍu
yĕdiḍi nā mai sŏmmu liṁdriyamulu
gudigŏni miṁchī nidigo sūḍarayyā
(||vedāṁta||)
kŏlam̐di janmamunagu guṟi nenu
vĕlaya nāgu guṟi śhrīveṁkaḍeśhum̐ḍu
sulabhabu nāguṇamu sujñānamu
sĕlarem̐gi sĕlarem̐gi sittagiṁchavayyā