Veda visaaraalu vaddu vishnu didamde

వెడ విచారాలు వద్దు విష్ణు డితఁడే
Language

(॥పల్లవి॥)
వెడ విచారాలు వద్దు విష్ణు డితఁడే
యెడయని వరము లిచ్చీ నీ దేవుఁడే

(॥వెడ॥)
మున్ను బలభద్రునికి మూర్తియై నిల్చినవాఁడు
సన్నిదై మునులచేఁ బూజ గొన్నవాఁడు
చెన్నుమీరు శేషాద్రిశిఖరమై యున్నవాఁడు
యిన్నిటి కెక్కుడైనవాఁడీ దేవుఁడే

(॥వెడ॥)
చదువులలోఁ జెప్పి స్వయంవ్యక్తమైనవాఁడు
కదిసి గుహునీసేవ గైకొన్నవాఁడు
వెదకఁగా సురలకు విశ్వరూపై యున్నవాఁడు
యెదుట గానఁగవచ్చీ నీ దేవుఁడే

(॥వెడ॥)
తొండమాంజక్రవర్తితో మాటలాడినవాఁడు
నిండుకొని పెద్దలకు నిధైనవాఁడు
అండనే శ్రీవేంకటేశుఁ డలమేలుమంగతోడ
యెండనీడకన్నులవాఁడీ దేవుఁడే

(||pallavi||)
vĕḍa visārālu vaddu viṣhṇu ḍidam̐ḍe
yĕḍayani varamu lichchī nī devum̐ḍe

(||vĕḍa||)
munnu balabhadrunigi mūrdiyai nilsinavām̐ḍu
sannidai munulasem̐ būja gŏnnavām̐ḍu
sĕnnumīru śheṣhādriśhikharamai yunnavām̐ḍu
yinniḍi kĕkkuḍainavām̐ḍī devum̐ḍe

(||vĕḍa||)
saduvulalom̐ jĕppi svayaṁvyaktamainavām̐ḍu
kadisi guhunīseva gaigŏnnavām̐ḍu
vĕdagam̐gā suralagu viśhvarūbai yunnavām̐ḍu
yĕduḍa gānam̐gavachchī nī devum̐ḍe

(||vĕḍa||)
tŏṁḍamāṁjakravardido māḍalāḍinavām̐ḍu
niṁḍugŏni pĕddalagu nidhainavām̐ḍu
aṁḍane śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁgadoḍa
yĕṁḍanīḍagannulavām̐ḍī devum̐ḍe