వయసు మొయిలువంటిది వట్టిజాగేల
(॥పల్లవి॥)
వయసు మొయిలువంటిది వట్టిజాగేల
ప్రియము చేకొనరాదా పెరరేఁచీ నతఁడు*
(॥వయ॥)
చలపాదితనమేల సంగడిఁ గూచుండవే
చలువుఁడు నీకొంగు చేరి పట్టీని
బలిమిఁ బెనఁగనేల పనులకు లోఁగావే
తెలిపి చెప్పి మాటల తీపు చల్లీని
(॥వయ॥)
గొప్ప రాఁగతనమేల కోరి విడెమియ్యవే
చిప్పిలఁగ వేఁడుకొని చేయొగ్గీని
ముప్పిరి సిగ్గిఁకనేల మోమెత్తి చూడఁగరాదా
వుప్పతిల్ల నవ్వునవ్వి వొడివట్టీ నిదివో
(॥వయ॥)
రట్టడితనములేల పట్టికూడి చక్కరాదా
యిట్టె శ్రీవేంకటేశుఁ డెనసె నిన్ను
గుట్టుసేసుకొననేల కూటమి మెచ్చఁగరాదా
నెట్టన నీ కిన్ని యును నేరపీ నొద్దికలు
(||pallavi||)
vayasu mŏyiluvaṁṭidi vaṭṭijāgela
priyamu segŏnarādā pĕrarem̐sī nadam̐ḍu*
(||vaya||)
salabādidanamela saṁgaḍim̐ gūsuṁḍave
saluvum̐ḍu nīgŏṁgu seri paṭṭīni
balimim̐ bĕnam̐ganela panulagu lom̐gāve
tĕlibi sĕppi māḍala tību sallīni
(||vaya||)
gŏppa rām̐gadanamela kori viḍĕmiyyave
sippilam̐ga vem̐ḍugŏni seyŏggīni
muppiri siggim̐kanela momĕtti sūḍam̐garādā
vuppadilla navvunavvi vŏḍivaṭṭī nidivo
(||vaya||)
raṭṭaḍidanamulela paṭṭigūḍi sakkarādā
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ ninnu
guṭṭusesugŏnanela kūḍami mĕchcham̐garādā
nĕṭṭana nī kinni yunu nerabī nŏddigalu