Vattiyaluga lele vadde neegu

వట్టియలుక లేలే వద్దే నీకు
Language

(॥పల్లవి॥)
వట్టియలుక లేలే వద్దే నీకు
గుట్టు తెలిసితి విఁకఁ గూడరాదా యితని

(॥వట్టి॥)
వొడఁబడఁజెప్పితేను వొక్కమనసై వుండు
కడునమ్మమెలఁగితేఁ గాదనరాదు
ఆడియాలాలు చూపితే ననుమానమే లేదు
తొడరి విభుని నీవు దూరఁ జోటే దిఁకను

(॥వట్టి॥)
తగవులు నెరపితే దాకొను సంతోషము
చిగిరించ నవ్వితేను చింత దీరును
మొగమోటఁ బైకొంటే మోహములు దైవారు
మగని నౌఁగాదన మరియేలే ఇఁకను

(॥వట్టి॥)
యిఁటికి విచ్చేసితేను యియ్యకోలౌఁ బొందులు
జంట వాయకుండితేను సతమౌఁ బ్రేమ
నంటున శ్రీవేంకటనగపతి నిన్నుఁ గూడె
అంటి నీవితని జరయఁగనేలే ఇఁకను

(||pallavi||)
vaṭṭiyaluga lele vadde nīgu
guṭṭu tĕlisidi vim̐kam̐ gūḍarādā yidani

(||vaṭṭi||)
vŏḍam̐baḍam̐jĕppidenu vŏkkamanasai vuṁḍu
kaḍunammamĕlam̐gidem̐ gādanarādu
āḍiyālālu sūbide nanumāname ledu
tŏḍari vibhuni nīvu dūram̐ joḍe dim̐kanu

(||vaṭṭi||)
tagavulu nĕrabide dāgŏnu saṁtoṣhamu
sigiriṁcha navvidenu siṁta dīrunu
mŏgamoḍam̐ baigŏṁṭe mohamulu daivāru
magani naum̐gādana mariyele im̐kanu

(||vaṭṭi||)
yim̐ṭigi vichchesidenu yiyyagolaum̐ bŏṁdulu
jaṁṭa vāyaguṁḍidenu sadamaum̐ brema
naṁṭuna śhrīveṁkaḍanagabadi ninnum̐ gūḍĕ
aṁṭi nīvidani jarayam̐ganele im̐kanu