వట్టియాసఁ బొరలేము వలచి పాయఁగలేక
(॥పల్లవి॥)
వట్టియాసఁ బొరలేము వలచి పాయఁగలేక
చిట్టకపుఁ జేతులకే చిక్కేవా
(॥వట్టి॥)
వుంకువైన బాసలును వొట్లుఁ దలఁచవట
జంకించి నేఁ జూచితేను జడిసేవా
పొంకమైన సేవలును పొందులు మఱచితివి
కంకణాలచేయి వేసితే కరఁగేవా
(॥వట్టి॥)
గాఁటపునీవలపులు కందువలుఁ జూడవట
మాఁటల సొలపులకు మనసిచ్చేవా
వాఁటపునా ప్రియములు వాసులు నెంచవైతివి
తేటలనా నవ్వులకు తెమలేవా
(॥వట్టి॥)
మన్ననలు నాగుణాలు మరి తలఁచితివట
చన్నులతాఁకుల కోర్చి సమ్మతించేవా
యిన్నిటా శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
యెన్నియైనా నాకోరిక లియ్యకూడేవా
(||pallavi||)
vaṭṭiyāsam̐ bŏralemu valasi pāyam̐galega
siṭṭagabum̐ jedulage sikkevā
(||vaṭṭi||)
vuṁkuvaina bāsalunu vŏṭlum̐ dalam̐savaḍa
jaṁkiṁchi nem̐ jūsidenu jaḍisevā
pŏṁkamaina sevalunu pŏṁdulu maṟasidivi
kaṁkaṇālaseyi veside karam̐gevā
(||vaṭṭi||)
gām̐ṭabunīvalabulu kaṁduvalum̐ jūḍavaḍa
mām̐ṭala sŏlabulagu manasichchevā
vām̐ṭabunā priyamulu vāsulu nĕṁchavaidivi
teḍalanā navvulagu tĕmalevā
(||vaṭṭi||)
mannanalu nāguṇālu mari talam̐sidivaḍa
sannuladām̐kula korsi sammadiṁchevā
yinniḍā śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
yĕnniyainā nāgoriga liyyagūḍevā