వట్టియాసల జిక్కి వడిఁబడుటే కాక
(॥పల్లవి॥)
వట్టియాసల జిక్కి వడిఁబడుటే కాక
కట్టుకొనేటి దేదీ కడ యేది
(॥వట్టి॥)
జనన మరణశీలి జంతువు
కనుఁగొనఁ దన కేది కాణాచి
తనువు కర్మమునకుఁ దా కట్టు
తనకు వేరే స్వతంత్రము లేవి
(॥వట్టి॥)
లలిఁ జిత్త మింద్రియముల లగ్గస్తుడూ
తొలఁగఁ దోయఁగ నేది దొరతనమూ
అలమి కాలము సంసారాధీనము
కొలఁదీ వెట్ట దనకు గురి యేది
(॥వట్టి॥)
బతుకెల్లా లోకాను బంధము
గతి గనఁ దన కిఁక గారణమేదీ
యితవై శ్రీవేంకటేశుఁ డేలెఁ గాక
మితిమీరి యిన్నాళ్ళు మెరయ నేదీ
(||pallavi||)
vaṭṭiyāsala jikki vaḍim̐baḍuḍe kāga
kaṭṭugŏneḍi dedī kaḍa yedi
(||vaṭṭi||)
janana maraṇaśhīli jaṁtuvu
kanum̐gŏnam̐ dana kedi kāṇāsi
tanuvu karmamunagum̐ dā kaṭṭu
tanagu vere svadaṁtramu levi
(||vaṭṭi||)
lalim̐ jitta miṁdriyamula laggastuḍū
tŏlam̐gam̐ doyam̐ga nedi dŏradanamū
alami kālamu saṁsārādhīnamu
kŏlam̐dī vĕṭṭa danagu guri yedi
(||vaṭṭi||)
badugĕllā logānu baṁdhamu
gadi ganam̐ dana kim̐ka gāraṇamedī
yidavai śhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐ gāga
midimīri yinnāḽḽu mĕraya nedī