Vattivesaalu sesuga vaadulagu doorevu

వట్టివేసాలు సేసుక వాదులకు దూరేవు
Language

(॥పల్లవి॥)
వట్టివేసాలు సేసుక వాదులకు దూరేవు
గుట్టు బాయిటను వేసి గురిగాఁ జేసితినా

(॥వట్టి॥)
కొప్పునే దువ్వితిఁగాక కోపగించి నిన్నేమైనా
వొప్పుగ మందటిపట్ల కొడిసితినా
విప్పక చేతులువట్టి వేఁడుకొంటిఁగాక నిన్ను
ముప్పిరి నొసలు మోపిమొక్కించుకొంటినా

(॥వట్టి॥)
కందువ లంటితిఁగాక కపటాన నిన్నేమైనా
కిందుపడ కొనగోర గీరితినా
అందుకొమ్మనుచు మోవినాకు నీ కిచ్చితిఁగాక
చెంది ఇప్పుడు నోరొగ్గించితినా యెంగిలికి

(॥వట్టి॥)
వలపు రేఁచితిఁగాక వడి నిన్ను నేమైనా
కులికి చన్నుల నొత్తి కుమ్మితినా
యెలమి శ్రీవేంకటేశ యెనసిమెచ్చితిఁగాక
పలుకులలో నే బూతుబండునఁ దిట్టితినా

(||pallavi||)
vaṭṭivesālu sesuga vādulagu dūrevu
guṭṭu bāyiḍanu vesi gurigām̐ jesidinā

(||vaṭṭi||)
kŏppune duvvidim̐gāga kobagiṁchi ninnemainā
vŏppuga maṁdaḍibaṭla kŏḍisidinā
vippaga seduluvaṭṭi vem̐ḍugŏṁṭim̐gāga ninnu
muppiri nŏsalu mobimŏkkiṁchugŏṁṭinā

(||vaṭṭi||)
kaṁduva laṁṭidim̐gāga kabaḍāna ninnemainā
kiṁdubaḍa kŏnagora gīridinā
aṁdugŏmmanusu movināgu nī kichchidim̐gāga
sĕṁdi ippuḍu norŏggiṁchidinā yĕṁgiligi

(||vaṭṭi||)
valabu rem̐sidim̐gāga vaḍi ninnu nemainā
kuligi sannula nŏtti kummidinā
yĕlami śhrīveṁkaḍeśha yĕnasimĕchchidim̐gāga
palugulalo ne būdubaṁḍunam̐ diṭṭidinā