Vattivesaalu sesevu vanidalellaam joodamgaa

వట్టివేసాలు సేసేవు వనితలెల్లాఁ జూడఁగా
Language

(॥పల్లవి॥)
వట్టివేసాలు సేసేవు వనితలెల్లాఁ జూడఁగా
ముట్టివచ్చితే నీవు మూఁకలో నొకతెవు

(॥వట్టి॥)
కాంతుఁ డింటికి రాఁగాను గక్కున మానుపవద్దా
ఇంతకర్తవైనదాన వెందు వోతివే
చెంత రమణుఁడు నీకు చేతికి లోనాయనట
ఇంతులు నగరినిండా యేడనుండి వచ్చిరే

(॥వట్టి॥)
చేరి విడెమియ్యఁగాను చేఇ పట్టుకొనవద్దా
యీరీతి బలిమిదాన వెందు వోతివే
ఆరయ నాతఁడు ను ఆడినట్టె ఆడునట
సారెకు నాతఁడు మాతో సరస మోట్లాడీనే

(॥వట్టి॥)
సమ్మతి నన్ను నేలె సన్న సేయవలదా
యెమ్మె లింతగలదాన వెందు వోతివే
నెమ్మి శ్రీవేంకటేశుఁడు నీమదిలో నుండునట
కమ్మర మమ్మెట్లాను కడుమన్నించితిరే

(||pallavi||)
vaṭṭivesālu sesevu vanidalĕllām̐ jūḍam̐gā
muṭṭivachchide nīvu mūm̐kalo nŏgadĕvu

(||vaṭṭi||)
kāṁtum̐ ḍiṁṭigi rām̐gānu gakkuna mānubavaddā
iṁtagardavainadāna vĕṁdu vodive
sĕṁta ramaṇum̐ḍu nīgu sedigi lonāyanaḍa
iṁtulu nagariniṁḍā yeḍanuṁḍi vachchire

(||vaṭṭi||)
seri viḍĕmiyyam̐gānu sei paṭṭugŏnavaddā
yīrīdi balimidāna vĕṁdu vodive
āraya nādam̐ḍu nu āḍinaṭṭĕ āḍunaḍa
sārĕgu nādam̐ḍu mādo sarasa moṭlāḍīne

(||vaṭṭi||)
sammadi nannu nelĕ sanna seyavaladā
yĕmmĕ liṁtagaladāna vĕṁdu vodive
nĕmmi śhrīveṁkaḍeśhum̐ḍu nīmadilo nuṁḍunaḍa
kammara mammĕṭlānu kaḍumanniṁchidire