Vattisiggulu vadanela vanidalalona nellaa

వట్టిసిగ్గులు వడనేల వనితలలోన నెల్లా
Language

(॥పల్లవి॥)
వట్టిసిగ్గులు వడనేల వనితలలోన నెల్లా
జట్టిగొని కెవ్మెూవి చవిచూపవయ్యా

(॥॥)
వొరసేచన్నులతోడ వొడివట్టితీసీ నాకె
గరిమ నీవిందుకుఁ బెనఁ గకువయ్యా
పరగఁ బయ్యెద జారఁ బరువున వచ్చె విదె
యిరువుగా విందుకుచెప్పీ నియ్యకొనవయ్యా

(॥॥)
వీడినతురుముతోడ విన్నపాలుసేసీ నాకె
తోడఁ దోడ నీవిట్టే తోయకువయ్యా
వేఁడుకఁబెంజెమటతో విడెమియ్యవచ్చె నిడె
జాడతోడ నీవు చేయిచాఁచి యందుకోవయ్యా

(॥॥)
బుసకొట్టునూర్పులతోఁ బూవులు గొమ్మనీ నాకె
కొసరుఁ గూరిమితోఁ జేకొనవయ్యా
యెసగ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
పొసఁగ నిద్దరుఁ దలపోసి చూడరయ్యా

(||pallavi||)
vaṭṭisiggulu vaḍanela vanidalalona nĕllā
jaṭṭigŏni kĕvmĕూvi savisūbavayyā

(||||)
vŏrasesannuladoḍa vŏḍivaṭṭidīsī nāgĕ
garima nīviṁdugum̐ bĕnam̐ gaguvayyā
paragam̐ bayyĕda jāram̐ baruvuna vachchĕ vidĕ
yiruvugā viṁdugusĕppī niyyagŏnavayyā

(||||)
vīḍinadurumudoḍa vinnabālusesī nāgĕ
toḍam̐ doḍa nīviṭṭe toyaguvayyā
vem̐ḍugam̐bĕṁjĕmaḍado viḍĕmiyyavachchĕ niḍĕ
jāḍadoḍa nīvu seyisām̐si yaṁdugovayyā

(||||)
busagŏṭṭunūrbuladom̐ būvulu gŏmmanī nāgĕ
kŏsarum̐ gūrimidom̐ jegŏnavayyā
yĕsaga śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
pŏsam̐ga niddarum̐ dalabosi sūḍarayyā