వట్టినవ్వు లంత యాల వావాతను
(॥పల్లవి॥)
వట్టినవ్వు లంత యాల వావాతను
నెట్టుకొనఁ జొక్కించితే నిన్నుఁ బొగడేము
(॥వట్టి॥)
వేడుక నీమాఁటలకు వెలలేదు అట్టె
కూడినకూటములకు గుఱిలేదు
యేడ సుద్దులు దడవే వింకా నీవు నన్ను
సూడిదెగా మన్నించితే చుట్టాలమయ్యేము
(॥వట్టి॥)
కొంగువట్టితే వలపు కుప్పవడదూ నీ-
వుంగిటి మెచ్చులనే వుట్టిపడదు
జంగిలికేల తెచ్చేవు సారెకు నీవు మా-
ముంగిటికి వచ్చితేనే మొక్కులు మొక్కేము
(॥వట్టి॥)
కన్నులఁ జూచినంతలో కాఁకదేరదూ లోలో
సన్నలుసేసినంతలో నడిదేరదు
ఇన్నిటా శ్రీవేంకటేశ ఇటు గూడితి మా-
విన్నపములు వింటేను విందుల వెట్టేము
(||pallavi||)
vaṭṭinavvu laṁta yāla vāvādanu
nĕṭṭugŏnam̐ jŏkkiṁchide ninnum̐ bŏgaḍemu
(||vaṭṭi||)
veḍuga nīmām̐ṭalagu vĕlaledu aṭṭĕ
kūḍinagūḍamulagu guṟiledu
yeḍa suddulu daḍave viṁkā nīvu nannu
sūḍidĕgā manniṁchide suṭṭālamayyemu
(||vaṭṭi||)
kŏṁguvaṭṭide valabu kuppavaḍadū nī-
vuṁgiḍi mĕchchulane vuṭṭibaḍadu
jaṁgiligela tĕchchevu sārĕgu nīvu mā-
muṁgiḍigi vachchidene mŏkkulu mŏkkemu
(||vaṭṭi||)
kannulam̐ jūsinaṁtalo kām̐kaderadū lolo
sannalusesinaṁtalo naḍideradu
inniḍā śhrīveṁkaḍeśha iḍu gūḍidi mā-
vinnabamulu viṁṭenu viṁdula vĕṭṭemu