Vattimaadalam bodu valabu peradiyaide

వట్టిమాటలఁ బోదు వలపు పేరడియైతే
Language

(॥పల్లవి॥)
వట్టిమాటలఁ బోదు వలపు పేరడియైతే
గుట్టుతో నేమీ ననక కొంగువట్టుమనరే

(॥వట్టి॥)
పాయపుఁ దానూ నేను పంతములాడుకొంటే
కాయము లందలి కండగర్వ మందురు
చాయల నేకతమున సమరతి వుపరతి
సోయగపు బలుములు చూపవలె ననరే

(॥పట్టి॥)
జాణల మిద్దరమును చనవునఁ బెనఁగితే
గాణలు మెరసినకాతర మందురు
ప్రాణమైనకాఁగిటిలో బంధవిశేషములను
రాణించఁజేసితే మేలు రాశికెక్కుననరే

(॥వట్టి॥)
వొక్కటైన తాను నేను వూరకేవుండితేను
మక్కువ మీరిన యట్టి మత్తు లందురు
ఇక్కువ శ్రీ వేంకటేశుఁడిదె నన్నుఁ గూడెఁగాన
యెక్కువ తక్కువ గల్తే నెంచవలె ననలే

(||pallavi||)
vaṭṭimāḍalam̐ bodu valabu peraḍiyaide
guṭṭudo nemī nanaga kŏṁguvaṭṭumanare

(||vaṭṭi||)
pāyabum̐ dānū nenu paṁtamulāḍugŏṁṭe
kāyamu laṁdali kaṁḍagarva maṁduru
sāyala negadamuna samaradi vubaradi
soyagabu balumulu sūbavalĕ nanare

(||paṭṭi||)
jāṇala middaramunu sanavunam̐ bĕnam̐gide
gāṇalu mĕrasinagādara maṁduru
prāṇamainagām̐giḍilo baṁdhaviśheṣhamulanu
rāṇiṁcham̐jeside melu rāśhigĕkkunanare

(||vaṭṭi||)
vŏkkaḍaina tānu nenu vūragevuṁḍidenu
makkuva mīrina yaṭṭi mattu laṁduru
ikkuva śhrī veṁkaḍeśhum̐ḍidĕ nannum̐ gūḍĕm̐gāna
yĕkkuva takkuva galde nĕṁchavalĕ nanale