వట్టిమాట లిఁక నేల వాసి గల కాంతలకు
(॥పల్లవి॥)
వట్టిమాట లిఁక నేల వాసి గల కాంతలకు
గుట్టుతోడ నుండేదె గుణ మింతే కాక
(॥వట్టి॥)
పూసుక వాసుక వచ్చి పొందులు నీతోఁ జెప్పి
వేసరించేకాఁగిటిలో వేడు కున్నదా
మూసినతముత్యమువలె మూల నుండఁగా నీవే
చేసినపాటి ప్రియము చేకొనేది గాక
(॥వట్టి॥)
చేరి నవ్వి విన్నపాలు చెలుటచేఁ జేయించి
సారెఁ జల్లేకూరిమిలో చవు లున్నవా
వూరక మానావతి నై వోజ దప్ప కుండఁగా నీ
వేరీతి చేసిన నది యియ్యకొంట గాక
(॥వట్టి॥)
యిచ్చకాలు సేసుకొంటా యెరవువలపు చల్లి
తచ్చి యెంత పిలిచినా తమి వుట్టీనా
అచ్చపు శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
యిచ్చట నీవే కూడితి విది మేలు గాకా
(||pallavi||)
vaṭṭimāḍa lim̐ka nela vāsi gala kāṁtalagu
guṭṭudoḍa nuṁḍedĕ guṇa miṁte kāga
(||vaṭṭi||)
pūsuga vāsuga vachchi pŏṁdulu nīdom̐ jĕppi
vesariṁchegām̐giḍilo veḍu kunnadā
mūsinadamutyamuvalĕ mūla nuṁḍam̐gā nīve
sesinabāḍi priyamu segŏnedi gāga
(||vaṭṭi||)
seri navvi vinnabālu sĕluḍasem̐ jeyiṁchi
sārĕm̐ jallegūrimilo savu lunnavā
vūraga mānāvadi nai voja dappa kuṁḍam̐gā nī
verīdi sesina nadi yiyyagŏṁṭa gāga
(||vaṭṭi||)
yichchagālu sesugŏṁṭā yĕravuvalabu salli
tachchi yĕṁta pilisinā tami vuṭṭīnā
achchabu śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
yichchaḍa nīve kūḍidi vidi melu gāgā