(॥పల్లవి॥)
వట్టిజోలి యిఁక వద్దేలే
నెట్టన రమణుఁడు నీపాలివాఁడు
(॥వట్టి॥)
కన్నుల సొలయక కాఁకలు చల్లక
సన్నలపిలుపులు చవి గావు
చన్నుల నొరయక సంగడి నిలువక
పన్నినవలపులు పస లేవు
(॥వట్టి॥)
ననుపు నటించక నవ్వులు నవ్వక
కొనగొనప్రియములు గుఱిలేవు
మనసులు గలయక మాఁటల దనియక
చెనకెటిచెనకుల సెలవే లేదు
(॥వట్టి॥)
చేతులు చాఁచక సిగ్గులు విడువక
కాతరపడితేఁ గలదా రతి
యీతరి శ్రీ వేంకటేశ్వరుఁ గూడితి
యేతలపోఁతల కెడ యేది
(||pallavi||)
vaṭṭijoli yim̐ka vaddele
nĕṭṭana ramaṇum̐ḍu nībālivām̐ḍu
(||vaṭṭi||)
kannula sŏlayaga kām̐kalu sallaga
sannalabilubulu savi gāvu
sannula nŏrayaga saṁgaḍi niluvaga
panninavalabulu pasa levu
(||vaṭṭi||)
nanubu naḍiṁchaga navvulu navvaga
kŏnagŏnapriyamulu guṟilevu
manasulu galayaga mām̐ṭala daniyaga
sĕnagĕḍisĕnagula sĕlave ledu
(||vaṭṭi||)
sedulu sām̐saga siggulu viḍuvaga
kādarabaḍidem̐ galadā radi
yīdari śhrī veṁkaḍeśhvarum̐ gūḍidi
yedalabom̐tala kĕḍa yedi