Vattijaalim badavaladimkanu

వట్టిజాలిఁ బడవలదిఁకను
Language

(॥పల్లవి॥)
వట్టిజాలిఁ బడవలదిఁకను
గట్టి విచారముగలవారికిని

(॥వట్టి॥)
దేవుఁడు సులభుఁడు తెలియఁగనేర్చిన
వేవేలు లాభము విరతి
భావించు జ్ఞానమె పాదైన సౌఖ్యము
తావగు శాంతమె ధనధాన్యములు

(॥వట్టి॥)
గురుఁడె సాధనము కోరి వెదకినను
పరగు నాచారమె బ్రదుకెల్లా
శరణాగతియె సామ్రాజ్యపదవి
ధర జితేంద్రియత్వమె వైభవము

(॥వట్టి॥)
తననిజభ క్తియె దండయు దాపును
మనసు నిలుపుటే మరి శుభము
యెనయఁగ శ్రీవేంకటేశుమహిమ లివి
కని మని యండుటె ఘనవివేకము

(||pallavi||)
vaṭṭijālim̐ baḍavaladim̐kanu
gaṭṭi visāramugalavārigini

(||vaṭṭi||)
devum̐ḍu sulabhum̐ḍu tĕliyam̐ganersina
vevelu lābhamu viradi
bhāviṁchu jñānamĕ pādaina saukhyamu
tāvagu śhāṁtamĕ dhanadhānyamulu

(||vaṭṭi||)
gurum̐ḍĕ sādhanamu kori vĕdaginanu
paragu nāsāramĕ bradugĕllā
śharaṇāgadiyĕ sāmrājyabadavi
dhara jideṁdriyatvamĕ vaibhavamu

(||vaṭṭi||)
tananijabha ktiyĕ daṁḍayu dābunu
manasu nilubuḍe mari śhubhamu
yĕnayam̐ga śhrīveṁkaḍeśhumahima livi
kani mani yaṁḍuḍĕ ghanavivegamu