Vattiguttu daamsevu vaddanenaa ne ninnu

వట్టిగుట్టు దాఁచేవు వద్దనేనా నే నిన్ను
Language

(॥పల్లవి॥)
వట్టిగుట్టు దాఁచేవు వద్దనేనా నే నిన్ను
చుట్టరికాలైన మీఁద సుద్దులు చెప్పవద్దా

(॥వట్టి॥)
తళుకుఁజెక్కులమీఁద తాచినకెంగేలు
మొలకనవ్వులతోడ మోవిపైడాలు
కలికికి నెంతసింగారమాయఁ జూడరాదా
చెలిమి సేసినమీఁద సిగ్గువడ నేఁటికి

(॥వట్టి॥)
మొనవాఁడి చన్నులపై మూసినపయ్యదకొంగు
మినకుబాహుమూలాల మెరిచేరంగు
మునుకొన్నయీపె మేనిమురిపెము చూడరాదా
ననిచినననుపులు నారటిల నేఁటికి

(॥వట్టి॥)
నులివచ్చిచెమటల నుదిటికస్తూరిబొట్టు
పెలుచుఁగుచ్చలమీఁదిపిరిచుట్టు
అలమేలు మంగ కెంత యమరెనుఁ జూడరాదా
కలిసితివి శ్రీవేంకటేశ జాగేఁటికి

(||pallavi||)
vaṭṭiguṭṭu dām̐sevu vaddanenā ne ninnu
suṭṭarigālaina mīm̐da suddulu sĕppavaddā

(||vaṭṭi||)
taḽugum̐jĕkkulamīm̐da tāsinagĕṁgelu
mŏlaganavvuladoḍa movibaiḍālu
kaligiki nĕṁtasiṁgāramāyam̐ jūḍarādā
sĕlimi sesinamīm̐da sigguvaḍa nem̐ṭigi

(||vaṭṭi||)
mŏnavām̐ḍi sannulabai mūsinabayyadagŏṁgu
minagubāhumūlāla mĕriseraṁgu
munugŏnnayībĕ menimuribĕmu sūḍarādā
nanisinananubulu nāraḍila nem̐ṭigi

(||vaṭṭi||)
nulivachchisĕmaḍala nudiḍigastūribŏṭṭu
pĕlusum̐guchchalamīm̐dibirisuṭṭu
alamelu maṁga kĕṁta yamarĕnum̐ jūḍarādā
kalisidivi śhrīveṁkaḍeśha jāgem̐ṭigi