Vattidosaalu gattevu vaddannaam bovu

వట్టిదోసాలు గట్టేవు వద్దన్నాఁ బోవు
Language

(॥పల్లవి॥)
వట్టిదోసాలు గట్టేవు వద్దన్నాఁ బోవు
ఱట్టడిసేఁతల నింతాఱడిసేతురా

(॥వట్టి॥)
చలివాయ గొల్లెతల సంగడిఁ గూచుండుకొంటా
బలిమి వారిపాదాలు పైవేసుకొంటా
కులికి చేతుల వారగుబ్బలు రాచుకొంటా
బులిసే వదేమోయి పొద్దువోదా నీకు

(॥వట్టి॥)
కొమరెపడుచులతో కొల్లున నవ్వుకొంటా
చెమటలంట చేతులఁ జెనకుకొంటా
అమర వారిపూదండ లవి మెడవేసుకొంటా
తమకించే వేఁటి దొరతనమోయి నీకు

(॥వట్టి॥)
మందబోయి రాండ్లను మానముపైఁ దిట్టుకొంటా
అంది పోఁకముడి విడిచాడు కొంటాను
ఇందరి శ్రీవేంకటేశ యెనసితిని మమ్మెల్లా
ఇందుముఖులెల్లాను ఇంతబాఁతే నీకు

(||pallavi||)
vaṭṭidosālu gaṭṭevu vaddannām̐ bovu
ṟaṭṭaḍisem̐tala niṁtāṟaḍisedurā

(||vaṭṭi||)
salivāya gŏllĕdala saṁgaḍim̐ gūsuṁḍugŏṁṭā
balimi vāribādālu paivesugŏṁṭā
kuligi sedula vāragubbalu rāsugŏṁṭā
bulise vademoyi pŏdduvodā nīgu

(||vaṭṭi||)
kŏmarĕbaḍusulado kŏlluna navvugŏṁṭā
sĕmaḍalaṁṭa sedulam̐ jĕnagugŏṁṭā
amara vāribūdaṁḍa lavi mĕḍavesugŏṁṭā
tamagiṁche vem̐ṭi dŏradanamoyi nīgu

(||vaṭṭi||)
maṁdaboyi rāṁḍlanu mānamubaim̐ diṭṭugŏṁṭā
aṁdi pom̐kamuḍi viḍisāḍu kŏṁṭānu
iṁdari śhrīveṁkaḍeśha yĕnasidini mammĕllā
iṁdumukhulĕllānu iṁtabām̐te nīgu