Vattidoorulela vesee vadde yimta | tana

వట్టిదూరులేల వేసీ వద్దే యింత । తన
Language

(॥పల్లవి॥)
వట్టిదూరులేల వేసీ వద్దే యింత । తన-
గుట్టు నే నెఱఁగనిదా కూడుకొంటి నేను

(॥వట్టి॥)
మఱి తాను నవ్వఁగాను మానుమంటినా నేను
తఱితోడ సిగ్గువడీ తానే కాక
వుఱక కాఁగిలించఁగా నొల్లనంటినా నేను
యెఱఁగి పరాకు సేసీ యేఁటికో కాక

(॥వట్టి॥)
కడఁగి సేసలెట్టఁగాఁ గాదంటినా నేను
తడవు జోలి దవ్వీ తానే కాక
జడిసి మాటాడఁగాను చాలునంటినా నేను
యెడ నెడ సొలసీని ఇది యేమో కాక

(॥వట్టి॥)
పొలసి లోనికి రాఁగాఁ బొమ్మంటినా నేను
తలవాకిటనే వుండీ తానే కాక
ఆలమి శ్రీవేంకటేశుఁ డంతలో విచ్చేసి కూడె
చలము సాదించీ యెంతసలిగో కాక

(||pallavi||)
vaṭṭidūrulela vesī vadde yiṁta | tana-
guṭṭu ne nĕṟam̐ganidā kūḍugŏṁṭi nenu

(||vaṭṭi||)
maṟi tānu navvam̐gānu mānumaṁṭinā nenu
taṟidoḍa sigguvaḍī tāne kāga
vuṟaga kām̐giliṁcham̐gā nŏllanaṁṭinā nenu
yĕṟam̐gi parāgu sesī yem̐ṭigo kāga

(||vaṭṭi||)
kaḍam̐gi sesalĕṭṭam̐gām̐ gādaṁṭinā nenu
taḍavu joli davvī tāne kāga
jaḍisi māḍāḍam̐gānu sālunaṁṭinā nenu
yĕḍa nĕḍa sŏlasīni idi yemo kāga

(||vaṭṭi||)
pŏlasi lonigi rām̐gām̐ bŏmmaṁṭinā nenu
talavāgiḍane vuṁḍī tāne kāga
ālami śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalo vichchesi kūḍĕ
salamu sādiṁchī yĕṁtasaligo kāga