Vattidagavulam bettee vaddannaa maanamdu

వట్టితగవులఁ బెట్టీ వద్దన్నా మానఁడు
Language

(॥పల్లవి॥)
వట్టితగవులఁ బెట్టీ వద్దన్నా మానఁడు
నెట్టన మీ రెఱఁగరు నిజమంటా నుందురు

(॥వట్టి॥)
తనకుఁ జేసినమేలు తానే యెఱుఁగుఁగాక
నను నేఁ బొగడుకొన నాయమా నాకు
అనరాదు వినరాదు ఆయాలు సోఁకినసుద్ది
మనసులో మర్మములు మరునికే తెలుసు

(॥వట్టి॥)
తతి నాచేఁతలు తానే తలఁచుకొనుట గాక
చతురతఁ బచరించ సంగతా నాకు
మితిలేదు మేరలేదు మెలఁగిన సరసాలు
కతకఱచినతనకాయమే యెఱుఁగును

(॥వట్టి॥)
కూడిననాకూటములు గుఱుతౌ తానేకాక
యేడనైనా విన్నవించ నెమ్మెలా నాకు
యీడుగ శ్రీవేంకటేశుఁ డెనసె నన్నింతలోనె
ఆడుకోలు తనమాఁట లంతట నిలుచునా

(||pallavi||)
vaṭṭidagavulam̐ bĕṭṭī vaddannā mānam̐ḍu
nĕṭṭana mī rĕṟam̐garu nijamaṁṭā nuṁduru

(||vaṭṭi||)
tanagum̐ jesinamelu tāne yĕṟum̐gum̐gāga
nanu nem̐ bŏgaḍugŏna nāyamā nāgu
anarādu vinarādu āyālu som̐kinasuddi
manasulo marmamulu marunige tĕlusu

(||vaṭṭi||)
tadi nāsem̐talu tāne talam̐sugŏnuḍa gāga
saduradam̐ basariṁcha saṁgadā nāgu
midiledu meraledu mĕlam̐gina sarasālu
kadagaṟasinadanagāyame yĕṟum̐gunu

(||vaṭṭi||)
kūḍinanāgūḍamulu guṟudau tānegāga
yeḍanainā vinnaviṁcha nĕmmĕlā nāgu
yīḍuga śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ nanniṁtalonĕ
āḍugolu tanamām̐ṭa laṁtaḍa nilusunā