Vattibaraagulu seyavaddu neegu nimkanela

వట్టిపరాకులు సేయవద్దు నీకు నిఁకనేల
Language

(॥పల్లవి॥)
వట్టిపరాకులు సేయవద్దు నీకు నిఁకనేల
గుట్టు నే మెఱుఁగుదుము కొంక నీకేఁటికిని

(॥వట్టి॥)
వేసరక వూడిగాలు వేమరుఁ జేసీ నీకె
పూసగుచ్చినట్టు నీకు బుద్ది చెప్పీని
వాసులువంతు లెంచక వద్దనే కాచుకున్నది
నీసము కాన నదిగో నెలఁతఁ జూడరాదా

(॥వట్టి॥)
కైవసము సేసుకొని కన్నుల నిన్ను నవ్వీని
వావులు నీతోఁ జెప్పి వలపించీని
పూవులు ముడిచి నీతో పొందులు నటించీని
దేవులాయ విన్నిటాను తెరవేసుకోరాదా

(॥వట్టి॥)
పానుపుపైఁ గూచుండి పాదాలు విసికీని
మేనిపై గందము వూసీ మెల్లనే తాను
ఆనుక శ్రీవేంకటేశ అలమేలు మంగ యీకె
పూని నిన్నుఁ గాఁగిలించె పొగడఁగరాదా

(||pallavi||)
vaṭṭibarāgulu seyavaddu nīgu nim̐kanela
guṭṭu ne mĕṟum̐gudumu kŏṁka nīgem̐ṭigini

(||vaṭṭi||)
vesaraga vūḍigālu vemarum̐ jesī nīgĕ
pūsaguchchinaṭṭu nīgu buddi sĕppīni
vāsuluvaṁtu lĕṁchaga vaddane kāsugunnadi
nīsamu kāna nadigo nĕlam̐tam̐ jūḍarādā

(||vaṭṭi||)
kaivasamu sesugŏni kannula ninnu navvīni
vāvulu nīdom̐ jĕppi valabiṁchīni
pūvulu muḍisi nīdo pŏṁdulu naḍiṁchīni
devulāya vinniḍānu tĕravesugorādā

(||vaṭṭi||)
pānububaim̐ gūsuṁḍi pādālu visigīni
menibai gaṁdamu vūsī mĕllane tānu
ānuga śhrīveṁkaḍeśha alamelu maṁga yīgĕ
pūni ninnum̐ gām̐giliṁchĕ pŏgaḍam̐garādā