Vattibamtamulu maado vaddu vaddayyaa

వట్టిపంతములు మాతో వద్దు వద్దయ్యా
Language

(॥పల్లవి॥)
వట్టిపంతములు మాతో వద్దు వద్దయ్యా
పట్టపుదేవులకును భ్రమయఁగవలదా

(॥వట్టి॥)
ఆయాలుసోఁకినమాట ఆపె నీతో నాడఁగాను
యీయెడ నీవు గరఁగ కెట్టు మానేవు
పాయపుఁజెలియ నీకు బత్తులెల్లాఁ జేయఁగాను
సోయగాన నీవెట్లఁ జొక్కకుండేవు

(॥వట్టి॥)
ముంచి యాపె నీకు చనుమొనలు చూపఁగాను
యెంచి యిట్టే పంపుసేయ కేల మానేవు
పొంచి నీరమణి నిన్నుఁ బొత్తుకుఁ బిలువఁగాను
కొంచించి నిలిచి ఇట్టె గుండె వట్టేవు

(॥వట్టి॥)
అలమేలుమంగ వురమందు నీకు నెక్కఁగాను
యెలమి నానందించ కెట్టు మానేవు
అలరి శ్రీవేంకటేశ ఆపె సరసమాడఁగ
పెలుచవై నీవెట్టు పెనఁగాడేవు

(||pallavi||)
vaṭṭibaṁtamulu mādo vaddu vaddayyā
paṭṭabudevulagunu bhramayam̐gavaladā

(||vaṭṭi||)
āyālusom̐kinamāḍa ābĕ nīdo nāḍam̐gānu
yīyĕḍa nīvu garam̐ga kĕṭṭu mānevu
pāyabum̐jĕliya nīgu battulĕllām̐ jeyam̐gānu
soyagāna nīvĕṭlam̐ jŏkkaguṁḍevu

(||vaṭṭi||)
muṁchi yābĕ nīgu sanumŏnalu sūbam̐gānu
yĕṁchi yiṭṭe paṁpuseya kela mānevu
pŏṁchi nīramaṇi ninnum̐ bŏttugum̐ biluvam̐gānu
kŏṁchiṁchi nilisi iṭṭĕ guṁḍĕ vaṭṭevu

(||vaṭṭi||)
alamelumaṁga vuramaṁdu nīgu nĕkkam̐gānu
yĕlami nānaṁdiṁcha kĕṭṭu mānevu
alari śhrīveṁkaḍeśha ābĕ sarasamāḍam̐ga
pĕlusavai nīvĕṭṭu pĕnam̐gāḍevu