వట్టిబాఁతిపడి నీపై వలపులు చల్లేముగాక
(॥పల్లవి॥)
వట్టిబాఁతిపడి నీపై వలపులు చల్లేముగాక
యిట్టయితే మరి యిఁక నేమిచెప్పేదయ్యా
(॥॥)
కాంతను నాయెదుటనె కాఁగిలించుకొంటివి
పంతములాడఁగ నిఁకఁ బనియేది
వింతలుగా సిగ్గులెల్లా విడిచినమీఁదట
యెంతకొసరినా నందు నేమిగలదయ్యా
(॥॥)
నావద్దనుండి యాకెతో నవ్వులు నవ్వితివి
భావించి చూచిన నిఁకఁ బనియేది
వేవేలకు మతిలోనివెరపు దీరినమీఁద
చేవమీరినసుద్దులు చెప్పఁ జోటేదయ్యా
(॥॥)
చలివాసి యాకెతోనే సరసములాడితివి
పలుమారుఁ బచ్చిసేయఁ బనియేది
ఆల మేల్మంగనైన న న్నట్టె యేలితివి
యెలమి శ్రీ వేంకటేశ యెట్టు మెచ్చేదయ్యా
(||pallavi||)
vaṭṭibām̐tibaḍi nībai valabulu sallemugāga
yiṭṭayide mari yim̐ka nemisĕppedayyā
(||||)
kāṁtanu nāyĕduḍanĕ kām̐giliṁchugŏṁṭivi
paṁtamulāḍam̐ga nim̐kam̐ baniyedi
viṁtalugā siggulĕllā viḍisinamīm̐daḍa
yĕṁtagŏsarinā naṁdu nemigaladayyā
(||||)
nāvaddanuṁḍi yāgĕdo navvulu navvidivi
bhāviṁchi sūsina nim̐kam̐ baniyedi
vevelagu madilonivĕrabu dīrinamīm̐da
sevamīrinasuddulu sĕppam̐ joḍedayyā
(||||)
salivāsi yāgĕdone sarasamulāḍidivi
palumārum̐ bachchiseyam̐ baniyedi
āla melmaṁganaina na nnaṭṭĕ yelidivi
yĕlami śhrī veṁkaḍeśha yĕṭṭu mĕchchedayyā