Vatti yichchagamu maado valenaa yimta

వట్టి యిచ్చకము మాతో వలెనా యింత
Language

(॥పల్లవి॥)
వట్టి యిచ్చకము మాతో వలెనా యింత
అట్టు నిట్టు నుందు గాక అప్పణేల యిఁకను

(॥వట్టి॥)
ఆయము సోఁకను చెలి యాడినట్టిమాటలకు
కాయము సోఁకితేనే కాఁక దీరెను
నాయములు వచరించి నాతో నేమి చెప్పేవు
చాయ సేసుకొందు గాక సటలేల యిఁకను

(॥వట్టి॥)
చేతులార ఆపె నిన్నుఁజేసినట్టిచేఁతలకు
యీతలఁ బొత్తుకుఁ బోతే యీసు వాసును
పోతరించి మమ్మునేల పొందులకుఁ దీసేవు
యేతులఁ గైకొందు గాక ఇంత యేల యిఁకను

(॥వట్టి॥)
ఆడ నాపె నీతోను అలిగినయలుకకు
వీడె మిచ్చి నంతలోనే వెత వాసెను
యీడుకు శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితిని
వేడుకతో నుందు గాక వేసా లేల యిఁకను

(||pallavi||)
vaṭṭi yichchagamu mādo valĕnā yiṁta
aṭṭu niṭṭu nuṁdu gāga appaṇela yim̐kanu

(||vaṭṭi||)
āyamu som̐kanu sĕli yāḍinaṭṭimāḍalagu
kāyamu som̐kidene kām̐ka dīrĕnu
nāyamulu vasariṁchi nādo nemi sĕppevu
sāya sesugŏṁdu gāga saḍalela yim̐kanu

(||vaṭṭi||)
sedulāra ābĕ ninnum̐jesinaṭṭisem̐talagu
yīdalam̐ bŏttugum̐ bode yīsu vāsunu
podariṁchi mammunela pŏṁdulagum̐ dīsevu
yedulam̐ gaigŏṁdu gāga iṁta yela yim̐kanu

(||vaṭṭi||)
āḍa nābĕ nīdonu aliginayalugagu
vīḍĕ michchi naṁtalone vĕda vāsĕnu
yīḍugu śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidini
veḍugado nuṁdu gāga vesā lela yim̐kanu