వట్టి యెమ్మెలు చెప్పఁగా వచ్చేదేమే
(॥పల్లవి॥)
వట్టి యెమ్మెలు చెప్పఁగా వచ్చేదేమే
నెట్టన నావలెనే మన్నింపించుకోవలెఁ బో
(॥వట్టి॥)
వాసికత్తెయైనది వడిఁ బంతాలు చూపదు
సేసి చూపు నూడిగాలు చేరి పతికి
రాసికెక్కినగరితె రవ్వసేసి మాటాడదు
మూసినము త్తెమువలె ముచ్చటలే యాడును
(॥వట్టి॥)
నేరుపరియిల్లాలు నేరమెంచదు విభుని
కోరి తనుమన్నించిన గుణాలెంచును
పారమైనచదురాలు సణంగులు నెరపదు
గారవించి తనిచ్చకములే నెరపును
(॥వట్టి॥)
జడిసి మానాపతి చలము సాదించదు
పుడమి శ్రీవేంకటేశుపొందు సాదించు
అడరి నన్నేలె నాతఁడల మేల్ మం గను నేను
యెడమనిచుట్టమైన దిట్లనే వుండును
(||pallavi||)
vaṭṭi yĕmmĕlu sĕppam̐gā vachchedeme
nĕṭṭana nāvalĕne manniṁpiṁchugovalĕm̐ bo
(||vaṭṭi||)
vāsigattĕyainadi vaḍim̐ baṁtālu sūbadu
sesi sūbu nūḍigālu seri padigi
rāsigĕkkinagaridĕ ravvasesi māḍāḍadu
mūsinamu ttĕmuvalĕ muchchaḍale yāḍunu
(||vaṭṭi||)
nerubariyillālu neramĕṁchadu vibhuni
kori tanumanniṁchina guṇālĕṁchunu
pāramainasadurālu saṇaṁgulu nĕrabadu
gāraviṁchi tanichchagamule nĕrabunu
(||vaṭṭi||)
jaḍisi mānābadi salamu sādiṁchadu
puḍami śhrīveṁkaḍeśhubŏṁdu sādiṁchu
aḍari nannelĕ nādam̐ḍala mel maṁ ganu nenu
yĕḍamanisuṭṭamaina diṭlane vuṁḍunu