Vatti yaaṟadim badevu valabu lonam bettuga

వట్టి యాఱడిఁ బడేవు వలపు లోనఁ బెట్టుక
Language

(॥పల్లవి॥)
వట్టి యాఱడిఁ బడేవు వలపు లోనఁ బెట్టుక
నెట్టిన నేఁడు నీకు నిద్ర వచ్చీనా

(॥వట్టి॥)
చెలియను నీ నెరులచిక్కు దియ్యు మంటాను
పలికి యామెతొడపై బవళించేవు
మలసి నీ మే నాపె మర్మములు సోఁకఁగాను
నెలకొని నీకు నేడు నిద్ర వచ్చీనా

(॥వట్టి॥)
పడఁతి నప్పటి నీదుపాదాలు గుద్దు మంటాను
బడివాయ కింటిలోనఁ బవ్వళించేవు
చిడిముడితో నాపె చేతులు నిన్ను సోఁకఁగా
నిడువాలుఁగన్నులకు నిద్ర వచ్చీనా

(॥వట్టి॥)
తొయ్యలిని నీవద్ద తోడు వుండు మంటాను
పయ్యదపై కేలు చాఁచి పవ్వళించేవు
చయ్యన శ్రీవేంకటేశ సమరతు లాయ మీకు
నెయ్యపు మీ కిందువల్ల నిద్ర వచ్చీనా

(||pallavi||)
vaṭṭi yāṟaḍim̐ baḍevu valabu lonam̐ bĕṭṭuga
nĕṭṭina nem̐ḍu nīgu nidra vachchīnā

(||vaṭṭi||)
sĕliyanu nī nĕrulasikku diyyu maṁṭānu
paligi yāmĕdŏḍabai bavaḽiṁchevu
malasi nī me nābĕ marmamulu som̐kam̐gānu
nĕlagŏni nīgu neḍu nidra vachchīnā

(||vaṭṭi||)
paḍam̐ti nappaḍi nīdubādālu guddu maṁṭānu
baḍivāya kiṁṭilonam̐ bavvaḽiṁchevu
siḍimuḍido nābĕ sedulu ninnu som̐kam̐gā
niḍuvālum̐gannulagu nidra vachchīnā

(||vaṭṭi||)
tŏyyalini nīvadda toḍu vuṁḍu maṁṭānu
payyadabai kelu sām̐si pavvaḽiṁchevu
sayyana śhrīveṁkaḍeśha samaradu lāya mīgu
nĕyyabu mī kiṁduvalla nidra vachchīnā