Vatti visaaramulela vadambada nimka nela

వట్టి విచారములేల వడఁబడ నిఁక నేల
Language

(॥పల్లవి॥)
వట్టి విచారములేల వడఁబడ నిఁక నేల
నెట్టన నన్నేలుకొనే నేరుపు నీ దిఁకను

(॥వట్టి॥)
కన్నుల నిన్నుఁ జూచితి కానుక చేతికివచ్చితి
యెన్నికలు మరియేమీ నెఱఁగ నేను
విన్నపముఁ జేసితి వేవేగ ను మొక్కితి
పన్ని నన్ను రక్షించేటి భారము నీ దిఁకను

(॥వట్టి॥)
ఇంటికి వచ్చితి నీకు నిచ్చకము లాడితి
దంటతన మెఱఁగ నీ తరుణి నేను
నంటునను వేఁడుకొంటి నయమే పచరించితి
పెంటాగా నన్నమన్నించే ప్రియము నీ దిఁకను

(॥వట్టి॥)
పొగడితి నన్నిటాను పొందులెల్లాఁ జేసితి
తగినవుపాయాలు దలఁచ నేను
నిగిడి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
మొగి నన్నుఁ గూడితివి ముదము నీ దిఁకను

(||pallavi||)
vaṭṭi visāramulela vaḍam̐baḍa nim̐ka nela
nĕṭṭana nannelugŏne nerubu nī dim̐kanu

(||vaṭṭi||)
kannula ninnum̐ jūsidi kānuga sedigivachchidi
yĕnnigalu mariyemī nĕṟam̐ga nenu
vinnabamum̐ jesidi vevega nu mŏkkidi
panni nannu rakṣhiṁcheḍi bhāramu nī dim̐kanu

(||vaṭṭi||)
iṁṭigi vachchidi nīgu nichchagamu lāḍidi
daṁṭadana mĕṟam̐ga nī taruṇi nenu
naṁṭunanu vem̐ḍugŏṁṭi nayame pasariṁchidi
pĕṁṭāgā nannamanniṁche priyamu nī dim̐kanu

(||vaṭṭi||)
pŏgaḍidi nanniḍānu pŏṁdulĕllām̐ jesidi
taginavubāyālu dalam̐sa nenu
nigiḍi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
mŏgi nannum̐ gūḍidivi mudamu nī dim̐kanu