వట్టి విచారములేల వాడలు దిరుగనేల
(॥పల్లవి॥)
వట్టి విచారములేల వాడలు దిరుగనేల
చుట్టమవయ్యేవుండి సూడువట్టరాదా
(॥వట్టి॥)
యింతితోడ నవ్వినవాఁడ వింటికి రారాదా
చెంతలనే యీడ రచ్చ సేయఁగ నేల
పంతగాఁడ వైతేఁగన పడఁతులనెల్లాఁ గూర్చి
చింతదీర తగవులు చెప్పించుకారాదా
(॥వట్టి॥)
మోము చూచినవాఁడవు మొగిఁ గూచుండఁగరాదా
సాము లేమిసేసేవు సటలకును
నేమముగలితేఁగన నెలఁతలఁ గూడపెట్టి
కామ శాస్త్రములు చూచి గతి గనరాదా
(॥వట్టి॥)
మోవి యిచ్చినవాఁడవు ముచ్చటాడరాదా
శ్రీవేంకటేశ యేల సిగ్గు పడేవు
కావరమెక్కితేఁగన కాంతలను మందడిగి
భావములో కసటెల్లా బాపుకొనరాదా
(||pallavi||)
vaṭṭi visāramulela vāḍalu diruganela
suṭṭamavayyevuṁḍi sūḍuvaṭṭarādā
(||vaṭṭi||)
yiṁtidoḍa navvinavām̐ḍa viṁṭigi rārādā
sĕṁtalane yīḍa rachcha seyam̐ga nela
paṁtagām̐ḍa vaidem̐gana paḍam̐tulanĕllām̐ gūrsi
siṁtadīra tagavulu sĕppiṁchugārādā
(||vaṭṭi||)
momu sūsinavām̐ḍavu mŏgim̐ gūsuṁḍam̐garādā
sāmu lemisesevu saḍalagunu
nemamugalidem̐gana nĕlam̐talam̐ gūḍabĕṭṭi
kāma śhāstramulu sūsi gadi ganarādā
(||vaṭṭi||)
movi yichchinavām̐ḍavu muchchaḍāḍarādā
śhrīveṁkaḍeśha yela siggu paḍevu
kāvaramĕkkidem̐gana kāṁtalanu maṁdaḍigi
bhāvamulo kasaḍĕllā bābugŏnarādā