Vatti vesaaleedanela vaddanare yammalaala

వట్టి వేసాలీడనేల వద్దనరే యమ్మలాల
Language

(॥పల్లవి॥)
వట్టి వేసాలీడనేల వద్దనరే యమ్మలాల
వొట్టి తానే పిలిచితే నోపనంటినా

(॥వట్టి॥)
కన్నులఁ దప్పక చూచి కాయము నాపై వేసి
మున్నిటివలపులేల మోపు గట్టీనే
అన్నిటాఁ దన్నుఁ దెలిసి అలసి వుండినదాని
కన్నవారెదుటనేల కాకు సేసీనే

(॥వట్టి॥)
ఆనలు సారెకుఁ బెట్టి అట్టె నాపైనుస్సురని
వూని తనవెదలేల వొప్పగించీనే
పూని తనమాయలలో పుట్టిపెరిగినదాన
తేనెలమాటలనేల తేలించీనే

(॥వట్టి॥)
మంచముపైఁ గూచుండి మన్నన నాకే యిచ్చి
యెంచరాని తన నిజమేల చూపీనే
అంచల శ్రీవేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
ముంచి నాతోనిప్పుడేల ముచ్చటలాడీనే

(||pallavi||)
vaṭṭi vesālīḍanela vaddanare yammalāla
vŏṭṭi tāne piliside nobanaṁṭinā

(||vaṭṭi||)
kannulam̐ dappaga sūsi kāyamu nābai vesi
munniḍivalabulela mobu gaṭṭīne
anniḍām̐ dannum̐ dĕlisi alasi vuṁḍinadāni
kannavārĕduḍanela kāgu sesīne

(||vaṭṭi||)
ānalu sārĕgum̐ bĕṭṭi aṭṭĕ nābainussurani
vūni tanavĕdalela vŏppagiṁchīne
pūni tanamāyalalo puṭṭibĕriginadāna
tenĕlamāḍalanela teliṁchīne

(||vaṭṭi||)
maṁchamubaim̐ gūsuṁḍi mannana nāge yichchi
yĕṁcharāni tana nijamela sūbīne
aṁchala śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍĕ
muṁchi nādonippuḍela muchchaḍalāḍīne