వట్టి వెఱపేలా నీకు వద్దనేనా నే నిన్ను
(॥పల్లవి॥)
వట్టి వెఱపేలా నీకు వద్దనేనా నే నిన్ను
పొట్టఁ బొరుగు పోరచి పుచ్చుకొనరాదా
(॥వట్టి॥)
మలసి నీతో నాపె మాట చెప్పఁ దిరిగీని
వెలయ లోనికిఁదీసి వినరాదా
చలపట్టి మాతోడి సరసా లెందువోయీని
వెలినున్న వలపులు వెలుచుకోరాదా
(॥వట్టి॥)
ననుపున నాపె నీతో నవ్వేనంటాఁ బూఁచీని
మనసొగ్గి వేళయిచ్చి మన్నించరాదా
చెనకేటి మాచేతిసేవ లెందువోయీని
పెనగొనే ముచ్చటలు పిరి దూరరాదా
(॥వట్టి॥)
యింతలో నిన్నాపె గూడి యేతులకుఁ బొదిగీని
చెంతల నా చనవులు చెల్లించరాదా
వింతగా శ్రీ వేంకటేశ వెస నన్నుఁ గూడితివి
బంతి చుట్టరికములు పనిగొనరాదా
(||pallavi||)
vaṭṭi vĕṟabelā nīgu vaddanenā ne ninnu
pŏṭṭam̐ bŏrugu porasi puchchugŏnarādā
(||vaṭṭi||)
malasi nīdo nābĕ māḍa sĕppam̐ dirigīni
vĕlaya lonigim̐dīsi vinarādā
salabaṭṭi mādoḍi sarasā lĕṁduvoyīni
vĕlinunna valabulu vĕlusugorādā
(||vaṭṭi||)
nanubuna nābĕ nīdo navvenaṁṭām̐ būm̐sīni
manasŏggi veḽayichchi manniṁcharādā
sĕnageḍi māsediseva lĕṁduvoyīni
pĕnagŏne muchchaḍalu piri dūrarādā
(||vaṭṭi||)
yiṁtalo ninnābĕ gūḍi yedulagum̐ bŏdigīni
sĕṁtala nā sanavulu sĕlliṁcharādā
viṁtagā śhrī veṁkaḍeśha vĕsa nannum̐ gūḍidivi
baṁti suṭṭarigamulu panigŏnarādā