వట్టి వాదులకునేల వచ్చీనే తాను
(॥పల్లవి॥)
వట్టి వాదులకునేల వచ్చీనే తాను
అట్టునిట్టు జంకించి ఆదరించరాదా
(॥వట్టి॥)
తగవు చెప్పరే మీరు తరుణులాల
మొగముచూచేపతికి మొక్కరాదా
మగఁడు దనకై తేను మాటమాట సరసాన
వెగటుగాఁ దిట్టి నేను వేఁడుకోరాదా
(॥వట్టి॥)
వొలపక్షమడకురే వువిదలాల
పలుమారుఁ బిలువఁగాఁ బలుకరాదా
మలసి తనవాఁడైతే మాతోఁ బెనఁగేవేళ
చెలఁగి గోరుదాఁకితే చెక్కునొక్కరాదా
(॥వట్టి॥)
మీకే తెలుసునే మెలుఁతలాల
కైకొని నన్నుఁ గూడితేఁ గలయరాదా
జోక శ్రీవేంకటేశుఁడు సొరిదినే యేలఁగాను
వాకునఁ బ్రియము చెప్పి వంచుకోరాదా
(||pallavi||)
vaṭṭi vādulagunela vachchīne tānu
aṭṭuniṭṭu jaṁkiṁchi ādariṁcharādā
(||vaṭṭi||)
tagavu sĕppare mīru taruṇulāla
mŏgamusūsebadigi mŏkkarādā
magam̐ḍu danagai tenu māḍamāḍa sarasāna
vĕgaḍugām̐ diṭṭi nenu vem̐ḍugorādā
(||vaṭṭi||)
vŏlabakṣhamaḍagure vuvidalāla
palumārum̐ biluvam̐gām̐ balugarādā
malasi tanavām̐ḍaide mādom̐ bĕnam̐geveḽa
sĕlam̐gi gorudām̐kide sĕkkunŏkkarādā
(||vaṭṭi||)
mīge tĕlusune mĕlum̐talāla
kaigŏni nannum̐ gūḍidem̐ galayarādā
joga śhrīveṁkaḍeśhum̐ḍu sŏridine yelam̐gānu
vāgunam̐ briyamu sĕppi vaṁchugorādā