వట్టి చింత నీకు నేల వంచిన శిరసులేల
(॥పల్లవి॥)
వట్టి చింత నీకు నేల వంచిన శిరసులేల
పట్టుమా అందిచ్చే నాపె బాగాలు నీకును
(॥వట్టి॥)
కూరిమి గలవాఁడవు కోపాలఁ బడనోపవా
యీరసాలాపె యాడినా యేమాయ నీకు
చేరి మాముందరగాఁగా సిగ్గువడేవో యేమో
రారమ్మ వొక్కటిసేసే రమణిని నిన్నును
(॥వట్టి॥)
చెట్టవట్టినవాఁడవు చెనకులకు లోఁగేవా
యెట్టు నిన్నాపెసేసినా నేమాయను
గుట్టు గంటిమని మాకుఁ బొంకి వున్నాఁడవో యేమో
నెట్టుకొలిపేరమ్మా నెలఁతలు నిన్నును
(॥వట్టి॥)
తగిలిన నీవు రతి తప్పులకు నోపవా
యెగ సక్కే లా పేమన్నా నే మాయను
నగి శ్రీ వేంకటేశుఁడ నన్నూ నాపెఁ గూడితివి
జగడాలు దిద్దే రమ్మా సకియను నిన్నును
(||pallavi||)
vaṭṭi siṁta nīgu nela vaṁchina śhirasulela
paṭṭumā aṁdichche nābĕ bāgālu nīgunu
(||vaṭṭi||)
kūrimi galavām̐ḍavu kobālam̐ baḍanobavā
yīrasālābĕ yāḍinā yemāya nīgu
seri māmuṁdaragām̐gā sigguvaḍevo yemo
rāramma vŏkkaḍisese ramaṇini ninnunu
(||vaṭṭi||)
sĕṭṭavaṭṭinavām̐ḍavu sĕnagulagu lom̐gevā
yĕṭṭu ninnābĕsesinā nemāyanu
guṭṭu gaṁṭimani māgum̐ bŏṁki vunnām̐ḍavo yemo
nĕṭṭugŏliberammā nĕlam̐talu ninnunu
(||vaṭṭi||)
tagilina nīvu radi tappulagu nobavā
yĕga sakke lā pemannā ne māyanu
nagi śhrī veṁkaḍeśhum̐ḍa nannū nābĕm̐ gūḍidivi
jagaḍālu didde rammā sagiyanu ninnunu