Vatti siggulam borali vaasula nalayanela

వట్టి సిగ్గులఁ బొరలి వాసుల నలయనేల
Language

(॥పల్లవి॥)
వట్టి సిగ్గులఁ బొరలి వాసుల నలయనేల
చుట్టరికము చెప్పితే చొక్కుచు మన్నించునే

(॥వట్టి॥)
సేవలు సేసితేను చిత్తము గరఁగదా
వావులు దెలిపితేను వద్దికి రాఁడా
మోవి చూపి మాఁటాడితే ముచ్చటలు గలయవా
యీవల నేపొద్దూ బతి యెదుటనే వుండవే

(॥వట్టి॥)
సరుసఁ గూచుండితేను సరసము లబ్బవా
మరిగించి నవ్వితేను మారు నవ్వఁడా
వరుసతోఁ జెనకితే వలపులు రేఁగవా
యెరవుసేయక పతి యెదుటనే వుండవే

(॥వట్టి॥)
తప్పక చూచితేను తలఁపునఁ బట్టదా
కప్పుక పెనఁగితేను కాఁగిలించఁడా
యిప్పు డిద్దరూఁ గూడితి రిదే మంచిదిగాదా
యెప్పుడూ శ్రీవేంకటేశు యెదుటనే వుండవే

(||pallavi||)
vaṭṭi siggulam̐ bŏrali vāsula nalayanela
suṭṭarigamu sĕppide sŏkkusu manniṁchune

(||vaṭṭi||)
sevalu sesidenu sittamu garam̐gadā
vāvulu dĕlibidenu vaddigi rām̐ḍā
movi sūbi mām̐ṭāḍide muchchaḍalu galayavā
yīvala nebŏddū badi yĕduḍane vuṁḍave

(||vaṭṭi||)
sarusam̐ gūsuṁḍidenu sarasamu labbavā
marigiṁchi navvidenu māru navvam̐ḍā
varusadom̐ jĕnagide valabulu rem̐gavā
yĕravuseyaga padi yĕduḍane vuṁḍave

(||vaṭṭi||)
tappaga sūsidenu talam̐punam̐ baṭṭadā
kappuga pĕnam̐gidenu kām̐giliṁcham̐ḍā
yippu ḍiddarūm̐ gūḍidi ride maṁchidigādā
yĕppuḍū śhrīveṁkaḍeśhu yĕduḍane vuṁḍave