Vatti siggu limkanela valabulu daivaare

వట్టి సిగ్గు లిఁకనేల వలపులు దైవారె
Language

(॥పల్లవి॥)
వట్టి సిగ్గు లిఁకనేల వలపులు దైవారె
జట్టిగొని నవ్వేదే జాణతన మిఁకను

(॥వట్టి॥)
సంగడిఁ గూచున్నదాకె చన్నుల నొత్తీనాపె
ఇంగిత మెఱఁగవు నీ కేడ పరాకు
వుంగరము వేలఁ బెట్టి వొడఁబడ మాటలాడి
సంగతిగా మన్నించుటే జాణతన మిఁకను

(॥వట్టి॥)
చెనకి నవ్వీనాపె సేసలు వెట్టీనాపె
యెనసివుండఁగా నీకేడ సిగ్గులు
మనసు రంజిల్లఁజేసి మర్మములు సారె నంటి
చనవిచ్చి మన్నించుటే జాణతన మిఁకను

(॥వట్టి॥)
కలువల వేసీ నాపె కాఁగిటఁ గూడీ నాపె
యెలమిఁ బెండ్లాడఁగా నీకేడ వెరగు
అలమి శ్రీ వేంకటేశ అట్టె సంతోసించఁ జేసి
సలిగె యిచ్చి మెచ్చుటే జాణతన మిఁకను

(||pallavi||)
vaṭṭi siggu lim̐kanela valabulu daivārĕ
jaṭṭigŏni navvede jāṇadana mim̐kanu

(||vaṭṭi||)
saṁgaḍim̐ gūsunnadāgĕ sannula nŏttīnābĕ
iṁgida mĕṟam̐gavu nī keḍa parāgu
vuṁgaramu velam̐ bĕṭṭi vŏḍam̐baḍa māḍalāḍi
saṁgadigā manniṁchuḍe jāṇadana mim̐kanu

(||vaṭṭi||)
sĕnagi navvīnābĕ sesalu vĕṭṭīnābĕ
yĕnasivuṁḍam̐gā nīgeḍa siggulu
manasu raṁjillam̐jesi marmamulu sārĕ naṁṭi
sanavichchi manniṁchuḍe jāṇadana mim̐kanu

(||vaṭṭi||)
kaluvala vesī nābĕ kām̐giḍam̐ gūḍī nābĕ
yĕlamim̐ bĕṁḍlāḍam̐gā nīgeḍa vĕragu
alami śhrī veṁkaḍeśha aṭṭĕ saṁtosiṁcham̐ jesi
saligĕ yichchi mĕchchuḍe jāṇadana mim̐kanu