Vatti siggu lemtigi vaddigi vachche vibhumdu

వట్టి సిగ్గు లేఁటికి వద్దికి వచ్చె విభుఁడు
Language

(॥పల్లవి॥)
వట్టి సిగ్గు లేఁటికి వద్దికి వచ్చె విభుఁడు
గట్టిగా నిద్దరు నిట్టె కాఁపురాలు సేయరే

(॥వట్టి॥)
చెలిమి పెంచఁజొచ్చితే చేఁగలెక్కును
బలిమిఁ బైకొంటేను పంత మలరు
కలిమి నొనగూడితే కడఁగు నింపు
అలమి చొక్కించవే అదివో నీ మగఁడు

(॥వట్టి॥)
కలికితనాలవంకఁ గళ లుబ్బును
చిలికితే వలపులు చిమ్మిరేఁగును
పలికి బొంకకుండితే బాస లీడేరు
కొలికికిఁ దెచ్చి పతి గూడవే రతులను

(॥వట్టి॥)
కలసి మెలఁగితేను కరఁగు మతి
సొలసి మాటాడితేను సొంపు గలుగు
వలసి నీకాఁగిటితే నలమేలు మంగ
వెలసీ నిదివో శ్రీవేంకటేశుఁడు

(||pallavi||)
vaṭṭi siggu lem̐ṭigi vaddigi vachchĕ vibhum̐ḍu
gaṭṭigā niddaru niṭṭĕ kām̐purālu seyare

(||vaṭṭi||)
sĕlimi pĕṁcham̐jŏchchide sem̐galĕkkunu
balimim̐ baigŏṁṭenu paṁta malaru
kalimi nŏnagūḍide kaḍam̐gu niṁpu
alami sŏkkiṁchave adivo nī magam̐ḍu

(||vaṭṭi||)
kaligidanālavaṁkam̐ gaḽa lubbunu
siligide valabulu simmirem̐gunu
paligi bŏṁkaguṁḍide bāsa līḍeru
kŏligikim̐ dĕchchi padi gūḍave radulanu

(||vaṭṭi||)
kalasi mĕlam̐gidenu karam̐gu madi
sŏlasi māḍāḍidenu sŏṁpu galugu
valasi nīgām̐giḍide nalamelu maṁga
vĕlasī nidivo śhrīveṁkaḍeśhum̐ḍu