Vatti semtalu seyamga vachchedemi

వట్టి చేఁతలు సేయఁగ వచ్చేదేమి
Language

(॥పల్లవి॥)
వట్టి చేఁతలు సేయఁగ వచ్చేదేమి
చుట్టరిక మేపొద్దు చూపుట గాక

(॥॥)
పంతమాడ నేఁటికి బలుదొరవు నీతోడ
యెంతైనా నూరకుండేది యెక్కుడు గాక
చెంత నొరయ నేఁటికి సిగ్గులెల్ల మెఱయఁగ
మంతనానఁ దలఁచుటే మంచిది గాక

(॥॥)
సారె నవ్వనేఁటికి జాణఁడవు నీతోడ
మేరలు మీఱకుండుటే మెచ్చులు గాక
ఆరీతిఁ గొసరనేల అలపులు దేరఁగాను
తారుకాణగా మెచ్చుటే తగవు గాక

(॥॥)
చెనకఁగ నేఁటికి శ్రీవేంకటేశ నీతోడఁ
జొనిపి రెండుగన్నులఁ జూచుట గాక
యెనసితి విదే నన్ను నిన్నిటా మన్నించఁగాను
తనువుఁ దనువు సోఁకి తనియుట గాక

(||pallavi||)
vaṭṭi sem̐talu seyam̐ga vachchedemi
suṭṭariga mebŏddu sūbuḍa gāga

(||||)
paṁtamāḍa nem̐ṭigi baludŏravu nīdoḍa
yĕṁtainā nūraguṁḍedi yĕkkuḍu gāga
sĕṁta nŏraya nem̐ṭigi siggulĕlla mĕṟayam̐ga
maṁtanānam̐ dalam̐suḍe maṁchidi gāga

(||||)
sārĕ navvanem̐ṭigi jāṇam̐ḍavu nīdoḍa
meralu mīṟaguṁḍuḍe mĕchchulu gāga
ārīdim̐ gŏsaranela alabulu deram̐gānu
tārugāṇagā mĕchchuḍe tagavu gāga

(||||)
sĕnagam̐ga nem̐ṭigi śhrīveṁkaḍeśha nīdoḍam̐
jŏnibi rĕṁḍugannulam̐ jūsuḍa gāga
yĕnasidi vide nannu ninniḍā manniṁcham̐gānu
tanuvum̐ danuvu som̐ki taniyuḍa gāga