Vatti sadalu sesevu vaadige maa mumdaranu

వట్టి సటలు సేసేవు వాడికె మా ముందరను
Language

(॥పల్లవి॥)
వట్టి సటలు సేసేవు వాడికె మా ముందరను
వెట్టికి నిదియూ నేనే విన్నవించవలెనా

(॥॥)
కూచుండ మనఁగరాదా కొమ్మను నీసంగడిని
నీచూపులకు గురై నిలుచున్నది
చేచేత మాముందరను సిగ్గువడ నేఁటికి
యీచోట నేకతమైతే నిట్టే వుండేవా

(॥॥)
మాటలడుగఁగ రాదా మర్మములు సోకఁగ
మోటు పెట్టుకందుకే తిమురుచున్నది
కూటపు మాముందరను గుట్టుసేయఁ నేఁటికి
పాటించి తెరమాటైతే పలుకకుండేవా

(॥॥)
కాఁగిలించుకొన రాదా కళలు సోఁకఁగ నిట్టే
రాఁగయై చన్నులు నిన్నొరయుచున్నది
చేఁగదేరఁ గూడితివి శ్రీవేంకటేశ్వర నన్ను
లోఁగిట నాపె వుండఁగా లోఁగాక మానేవా

(||pallavi||)
vaṭṭi saḍalu sesevu vāḍigĕ mā muṁdaranu
vĕṭṭigi nidiyū nene vinnaviṁchavalĕnā

(||||)
kūsuṁḍa manam̐garādā kŏmmanu nīsaṁgaḍini
nīsūbulagu gurai nilusunnadi
seseda māmuṁdaranu sigguvaḍa nem̐ṭigi
yīsoḍa negadamaide niṭṭe vuṁḍevā

(||||)
māḍalaḍugam̐ga rādā marmamulu sogam̐ga
moḍu pĕṭṭugaṁduge timurusunnadi
kūḍabu māmuṁdaranu guṭṭuseyam̐ nem̐ṭigi
pāḍiṁchi tĕramāḍaide palugaguṁḍevā

(||||)
kām̐giliṁchugŏna rādā kaḽalu som̐kam̐ga niṭṭe
rām̐gayai sannulu ninnŏrayusunnadi
sem̐gaderam̐ gūḍidivi śhrīveṁkaḍeśhvara nannu
lom̐giḍa nābĕ vuṁḍam̐gā lom̐gāga mānevā